2019 polls not to be cakewalk for bjp సార్వత్రిక ఎన్నికలలో బీజేపి బలం తగ్గుతుందా.?

2019 lok sabha polls unlikely to be a cakewalk for bjp rss

BJP, Gujarat results, Gujarat elections, Gujarat assembly elections, Gujarat polls, Lok Sabha elections, 2019, BJP, Congress, NDA, PM Modi, RSS, Amit shah, 2019 General elections, elections, national elections, political campaigns, political candidates, politics, elections

The lower-than-expected poll performance of the BJP in Gujarat suggests that the 2019 general elections are not going to be a cakewalk for the NDA lead party

2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపి బలం తగ్గుతుందా.?

Posted: 12/27/2017 12:20 PM IST
2019 lok sabha polls unlikely to be a cakewalk for bjp rss

2019 సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి వస్తామని అధికార బీజేపీ, ఇప్పటికే ధీమాను వ్యక్తం చేస్తున్నా.. సీట్లు మాత్రం గణనీయంగా తగ్గుతాయని ఇప్పటికే పలు సర్వేసంస్థల అంచనాలు పేర్కొంటున్నాయి.  గుజరాత్ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా బిజేపి ప్రభావాన్ని తగ్గిస్తాయని కూడా అంచనాలు చెబుతున్నాయి. కాగా అటు కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలను అందుకున్న రాహుల్‌ నేతృత్వంలో పార్టీ జోరందుకుందని, రాహుల్ కూడా పరిణితి చెందిన నేతలా వ్యవహరిస్తూ. చౌకబారు వ్యాఖ్యలు, దిగజారుడు విమర్శలకు దూరంగా. హుందాతనం కలిగిన రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం కావడంతో.. రానున్న సార్వత్రిక ఎన్నికలు ఇటు అధికార బీజేపి, అటు విపక్ష కాంగ్రెస్‌ మధ్యన రసవత్తర పోరుగా మారనున్నాయని తెలుస్తుంది.

అయితే ఈ సారి బీజేపీ గెలుపు నల్లేరుపై బండి నడక కాబోదని బీజేపీ మాతృసంస్థగా భావించే ఆరెస్సెస్‌ కూడా అభి్ప్రాయపడింది. ఈ సారి ప్రధాని మోదీకి 60 సీట్లకు పైగా తగ్గవచ్చని అంచనా వేసింది. గత ఎన్నికలలో ఏకపక్షంగా పార్లమెంటులో మెజారిటీ సాధించిన బీజేపి రానున్న ఎన్నికలలో మాత్రం మిత్రులు సహకారం తీసుకోవాల్సిందేనని అంటోంది. అందుకు గల కారణాలు ఇవీ అని ఇదమిత్థంగా చెప్పకపోయినప్పటికీ- బీజేపీ వ్యతిరేకత కాస్త పెరిగిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభిప్రాయం. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి బీజేపికి ఎదురుగాలి వీచే అవకాశాలే ఎక్కవని అరెస్సెస్ అంచనా వేసింది.

దీనికి తోడు ఈ రాష్ట్రాలకు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా నిలిచే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ఎన్నికలలో విజయం సాధించడం విషయాన్ని పక్కనబెడితే.. ఈ ఫలితాలు తప్పక ఆ వెనువెంటనే వచ్చే లోక్ సభ ఎన్నికలపై పడతాయని విశ్లేషకుల అంచనా. ఇక వీటితో పాటు కర్ణాటక, నాగాలాండ్‌, మిజోరం, మేఘాలయ, త్రిపురల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. బీజేపీ 2019 ఫలితాన్ని ఇవి ముందే చెప్పేస్తాయి. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 64 సీట్ల కంటే ఎక్కువ రావని, కాంగ్రెస్‌ 100 సీట్లు సాధిస్తుందని ఆరెస్సెస్‌ అంచనా వేసింది. దీంతో మోదీకి, అమిత్‌షాకి నిద్రపట్టలేదు.
 
అత్యంత పకడ్బందీగా బూత్‌ల స్థాయి వారీగా వ్యూహం నిర్మించి అతి కష్టం మీద విజయం సాధించగలిగింది. మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే కేవలం ఏడుసీట్లే ఎక్కువ వచ్చాయి ఆ పార్టీకి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ ఓటమి తప్పదని ఆరెస్సెస్‌ అంచనా. రాజస్థాన్‌లోనూ పరిస్థితేం బాగోలేదు. ఇక ఛత్తీ్‌సగఢ్‌లో కాంగ్రె్‌సకు నాయకత్వలోపం ఓ పెద్ద శాపం. కర్ణాటకలో కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 543సీట్లకు గాను ఎన్డీయే 336 సీట్లు సాధించింది. బీజేపీ సొంతంగా 282 సాధించి మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే పది సీట్లు ఎక్కువే పోగేసుకుంది. ఆ పరిస్థితి ఈ మారు ఉండదని, బీజేపీ సీట్ల సంఖ్యలోనే దాదాపు 60 తగ్గవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Gujarat results  Lok Sabha elections  PM Modi  RSS  Amit shah  2019 General elections  BJP  Congress  NDA  politics  

Other Articles