Jadhav’s family harassed: India జాదవ్ తల్లిపై పాక్ మీడియా అనుచిత వ్యాఖ్యలు..

India hits back at pak says jadhav s statement clearly tutored and designed to perpetuate false narrative

S Jaishankar, Pakistan, Sushma Swaraj, Kulbhushan Jadhav, ministry of external affairs (MEA), International Court of Justice (ICJ), Pakistani media, JP Singh, Terrorist, Indian High Commission, Kulbushan Jadhav family, Kulbushan Jadhav mother, Kulbushan Jadhav wife, ICJ

Jadhav's wife was asked to remove her 'bindi', 'mangal sutra'; mother was not allowed to speak in their mother tongue during the meeting, alleges Ministry.

భర్తను కలిసేందుకు బొట్టు, మంగళసూత్రాలు తీయాలా.. బురఖా ధరించాలా.?

Posted: 12/27/2017 11:48 AM IST
India hits back at pak says jadhav s statement clearly tutored and designed to perpetuate false narrative

భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ పై పాకిస్థాన్ లో పర్యటిస్తున్న భారత గూఢచారి అని ముద్ర వేసి మరణశిక్ష విధించి పాకిస్థాన్ జైలులో బంధీగా వున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ న్యాయస్థానం అదేశాల మేరకు అతనికి విధించిన శిక్షను వాయిదా వేసిన పాకిస్థాన్.. అతన్ని అనేక వేధింపులకు గురిచేసిందన్న విషయాలు కూడా బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలో జాదవ్ ను కలిసేందుకు పాకిస్థాన్ వెళ్లిన ఆయన తల్లి, భార్యపై పాక్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేసింది.

ఎన్నో ఆంక్షల తర్వాత కుల్ భూషణ్ ను కలిసేందుకు ఆయన తల్లి అవంతి జాదవ్, భార్య చేతన్ కుల్ జాదవ్ లకు అనుమతి ఇచ్చిన పాక్ అక్కడ కూడా ఆంక్షలు విధించింది. తన భర్తను చూడాలని జాదవ్ భార్య భావిస్తే ముఖానికి వున్న బొట్టుతో పాటు మంగళసూత్రం కూడా తీసివేయాలని అదేశించింది. ఇక అంతటితో కూడా పాక్ దుర్మార్గం అగలేదు. అమెను నల్లని వస్త్రాలతోనే భర్తను కలిసేందుకు రావాలని కూడా సూచించింది. దీంతో తన భర్త దీర్ఘాయష్ఫును కోరుతూ మంగళప్రదంగా పెట్టుకునే బోట్టు, మంగళసూత్రాలను వేసుకునే హైందవ సంప్రదాయాన్ని వీడితేనే చూడాలని అంక్షలు విధంచడంతో అమె అలాగే చేసి తన భర్తను చూసింది. అయితే తన కుమారుడిని నేరుగా కలవకుండా గాజు తెర అడ్డంగా పెట్టింది.

పాకిస్థాన్ జైలు అధికారులు ఇలా అంక్షల మధ్య వారిని జాదవ్ తో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తే.. వారు బయటకు రాగానే పాకిస్తాన్ మీడియా కూడా వారిపట్ల అనుచితంగా వ్యవహరించింది. ఆమెను హంతకుడి తల్లి (ఖాతిల్ కా మా) అని సంబోధించి తన వక్రబుద్ధిని చాటుకుంది. ఇస్లామాబాద్ లోని విదేశాంగశాఖ కార్యాలయం బయటే ఈ వ్యాఖ్యలు చేసింది. కుల్ భూషణ్ తల్లి, భార్యను కారులో కూర్చెబెట్టిన సమయంలో జర్నలిస్టులు ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ మీడియా తీరుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కుల్ భూషణ్ జాదవ్ ను వేగు అని ముద్ర వేసి.., గూడాచార్యం చేస్తున్నాడన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్.. అయన కేసును వేగంగా విచారించి ఏకంగా.. ఏప్రిల్‌ లో మరణశిక్ష విధించింది. పాకిస్తాన్ చర్యలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడం.. ఈ లోపు భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. న్యాయం చేయాలని కోరడంతో అతడి ఉరిపై స్టే విధించింది. కాగా, ఈ విషయమై రేపు భారత విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ పార్లమెంటులో ప్రకటన చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles