The hundreds of farmers from north Karnataka feel devastated after BJP state president B.S. Yeddyurappa backtracked on his promise to get them Mahadayi water.

Yeddyurappa gets emotional during bjp core committee meeting

Mahadayi dispute, Mahadayi dispute news, Yeddyurappa, mahadayi, BJPs promise of resolving Mahadayi river dispute, Congress, BJP, Karnataka, Nation, Current Affairs, India

The hundreds of farmers from north Karnataka feel devastated after BJP state president B.S. Yeddyurappa backtracked on his promise to get them Mahadayi water.

సొంతపార్టీ నేతలపై అరోపణలు.. రైతులకు భరోసా కల్పించలేని వ్యాఖ్యలు

Posted: 12/27/2017 10:53 AM IST
Yeddyurappa gets emotional during bjp core committee meeting

మహదాయి నదీ జలాల వివాదాన్ని పరిష్కారంలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్ప తమను వంచించాడని కర్ణాటక రైతులు అందోళన తీవ్ర రూపం దాల్చింది. మహదాయి నదీ జలాలను తీసుకువస్తానని హామీని ఇచ్చిన నేత వెనక్కు తగ్గిన నేపథ్యంలో రైతులు ఏకంగా ఆయన వ్యతిరేకంగా అందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. తన నివాసంలో నిర్వహించిన బీజేపి కోర్ కమిటీ సమావేశం తరువాత శుభవార్తను వినడం కోసం అసక్తిగా ఎదురుచూస్తున్న రైతులు.. భావోద్వేగానికి గురై అధికార పక్షం సహా విపక్షాలపై విమర్శలు చేసిన యడ్యూరప్ప.. చివరకు సోంతపార్టీ నేతలపై కూడా అరోఫణలు చేశారు.

అయితే తాము ఎదురుచూస్తున్న మహదాయి నదీ జలాల విషయంలో ఎలాంటి స్పష్టత రాకపోవడం.. అగ్రహించిన రైతులు ఏకంగా రాష్ట్ర బీజేపి కార్యాలయం ఎదుట గత నాలుగురోజులుగా ధర్నాకు దిగారు. ఇక ఈ విషయంలో సొంతపార్టీ నేతలపై యడ్యూరప్ప విమర్శించడంతో.. అయన వెనక్కు తగ్గినట్లు అర్థం చేసుకున్న రైతులు.. తమను బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు తప్పదారి పట్టించారంటూ..  ఆయనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యడ్యూరప్ప ప్రసంగం తరువాత ఆయన మహదాయి నదీ జలాలను విషయంలో వెనక్కు తగ్గారన్న వార్తలు రావడంతోనే దర్వాడా జిల్లాకు చెందిన బకీరవ యమనప్ప అగసర్ అనే మహిళతో పాటు, యమనూర్ జిల్లా నుంచి కస్తూరవ అనే మహిళ కూడా సృహ కోల్పోయారు.

వీరిని కెసి జనరల్ అసుపత్రికి తరలించిన పోలీసులు వారికి చికిత్స అందిస్తున్నారు. తోఇదిలా వుండరించేందుకు పూర్తి నిజాయితీతో ప్రయత్నిస్తున్నాను. కాగా కోర్ కమిటీ సమావేశానంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నేతలు సైతం నా పై కుట్ర పన్నుతున్నారు. తనను కావాలనే ఇబ్బందులకు గురిచేసేలా ప్రయత్నిస్తున్నారపి అరోపించారు. బీజేపీ-జేడీఎస్‌ సంయుక్త ప్రభుత్వం ఉన్న సమయంలో తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను.

ఆ సమయంలో కళసా-బండూరి నాలా కార్యక్రమం అమలుకు రూ.100 కోట్లు కేటాయించాను. ఇందుకు అప్పటి సీఎం హెచ్‌.డి.కుమారస్వామి తీవ్ర అభ్యంతరం తెలియజేసినా తాను అదేమీ పట్టించుకోలేదు. అందుకే ఉత్తర కర్ణాటక ప్రజలు నన్ను అభిమానిస్తారు. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్‌ నేతలు తనపై కుట్రలు పన్నుతున్నారు. ఇందుకు సొంత ఆర్టీ నేతలే సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీలు ప్రకాష్‌ జవదేకర్, పీయూష్‌ గోయల్ తో పాటు పార్టీ రాష్ట్ర నేతలు జగదీష్‌ శెట్టర్, ప్రహ్లాద్‌ జోషి, ఆర్‌.అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahadayi dispute  B.S. Yeddyurappa  Congress  BJP  Karnataka  Nation  Current Affairs  India  

Other Articles