village hold kissing contest for couples బహిరంగ చుంబన పోటీలు.. విజేతలకు బహుమతలు

Kissing competition held in jharkhand in presence of legislator

couples, kissing competition, tribal community, simon marandi, Kissing competition, Tribals, Dumaria village, Jharkhand

In a bizarre event, a kissing competition was held in a fair organised for members of tribal community in Jharkhand. And the competition was held in presence of legislator Simon Marandi.

బహిరంగ చుంబన పోటీలు.. విజేతలకు బహుమతలు

Posted: 12/11/2017 01:13 PM IST
Kissing competition held in jharkhand in presence of legislator

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గూ అన్నట్లుంది ఓ ప్రజా ప్రతినిధి వ్యవహారం. ఓ వైపు పాశ్యాత సంస్కృతి జడలు విప్పి నాట్యం చేస్తూ.. అబలలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న తరుణంలో.. అక్కడ ఓ ప్రజాప్రతినిధి మాత్రం తన దారి తనదేనని నిరూపించుకున్నాడు. ఏకంగా అదివాసీల గ్రామ జాతరలో అధర చుంబనం పోటీలు పెట్టించి మరీ వికృతానందం పోందాడు. నాలుగు గోడల మధ్య.. భార్యభర్తల మధ్య రహస్యంగా జరగాల్సిన శృంగారాల్ని చూసి అనందించాలని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. బహిరంగ చుంబనం పోటీలు నిర్వహించి మరీ గెలుపోందిన జంటలకు బహుమతలు ప్రకటించాడు.

జార్ఖండ్ లో మోడ్రన్ లైఫ్ స్టయిల్ కు ప్రోత్సాహాన్ని అందించేందుకు తన సోంత గ్రామంలో జరిగిన ఓ జాతరలో జంటల మధ్య వినూత్నమైన పోటీని నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే నసైమన్ మరాండీ . ఆదివాసీయుల మధ్య ప్రేమ, వారి సమాజంలో నగరికతను పెంపొందించేందుకు ఏకంగా కిస్సింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కాంపిటీషన్ లో పాల్గోని గెలిచిన జంటలకు బహుమతులు కూడా ప్రకటించారు. ఈ పోటీలలో పాల్గోన్న చేసిన వారంతా ఆదివాసీయులే కావడం విశేషం. అదివాసీల అభ్యున్నతికి ఏం చేయాలన్న అలోచనను రానీయకుండా.. వారికి అదర చుంబనం పోటీలను పెట్టారు.

ఈ పోటీలలో కొత్తగా పెళ్లైన అదివాసీ జంటలు మొదలు నడివయస్సు జంటలు కూడా పాల్గోన్నాయి. ఈ జంటలు ఒకరికొకరు గాఢంగా చుంబించుకున్నారు. ఈ పోటీలలో పాల్గొన్న జంటలు మాత్రం ఇలా చేయడం వల్ల తమ భాగస్వాములపై తమకు మరింత ప్రేమ పెరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది ఎమ్మెల్యే స్వగ్రామమైన తాల్ పహాడీలో జరిగింది. ఈ పోటీలలో అత్యధిక సమయం ముద్దు పెట్టుకుంటున్న మూడు జంటలను విజేతలుగా ప్రకటించి బహుమతులు అందజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles