pawan suggests akhilapriya to meet boat victim families

Pawan kalyan suggests akhilapriya to meet boat victim families

Jana Sena, Pawan Kalyan, chalore chalore chal, ongole,akhila priya, nandyal, tourism minister, janasena, TDP, krisha ferry incident, victim familes, , krishna ferry victim families, TDP leaders, wrong propaganda, paritala ravi, tonsure, gundu, ethnic qualities, fatima students, fatima medical college, fatima students pawan kalyan, caste, Indian, human, rajamundry, party activists, telugu states tour, political tour, Andhra Pradesh

Actor turned politician janasena chief power star pawan kalyan advises tourism minister bhuma akhila priya to meet boat victim families and share their agony as you know the pain of losing the beloved parents.

ప్రమాదాలు, పరిహారాలు లేని ప్రభుత్వాలు రావాలి: పవన్ కల్యాన్

Posted: 12/09/2017 11:55 AM IST
Pawan kalyan suggests akhilapriya to meet boat victim families

చలోరే చలోరే చల్ పర్యటనలో భాగంగా ఒంగోలు పర్యటనలో ఉన్న జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బోటు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారితో మాట్లాడి, ఆవేదనను తీర్చే ప్రయత్నం చేశారు. టీడీపీ మీద, టూరిజం మంత్రి మీద దాడికి ఈ వేదికను ఉపయోగించడం లేదన్నారు. నష్టపరిహారాలతో ప్రాణాలు తిరిగివస్తాయా..? ఒక్కసారి జరిగితే ప్రమాదం.. అదే పునారావృతం అవుతుంటే ఆ ప్రమాదాలకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. పరిహారాల ప్రకటన లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీదే వుందని పవన్ అన్నారు.

ఇంటి సభ్యులను కొల్పయిన బాధ అందులోనూ ఇలా అకస్మాత్తుగా ప్రమాదాల భారిన పడి మన అనుకున్న వారిని కోల్పోతే బాధ మాట్లలో చెప్పలేదనిదని అన్నారు. అలాంటి క్షోభ మరే కుటుంబానికి రాకుండా చేయాలంటే ఏ చర్యలు తీసుకోవాలో ప్రభుత్వాలే ఆలోచించాలన్నారు. నిర్లక్ష్య ధోరణి, చేసిన పనే చేసి విసిగిపోతాం.. ఇంతేగా అనుకుంటాం.. కానీ ప్రమాదం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలయిదు కాబట్టి అప్రమత్త అవసరమన్నారు. సున్నితత్వం కోల్పోకూడదని.. అదే ఇన్ని ప్రాణాలను బలితీసుకుందని పవన్ ఉద్వేగంగా మాట్లాడారు.

ఓటు అనే బోటు మీద మీరు తీరం దాటిన రాజకీయ నేతలు.. అదే బోటు ప్రయాణంలో తమ ప్రాణాలను కొల్పోయిన వారిని మాత్రం పరామర్శించరు. ప్రమాదం జరిగిందని అంటున్నారు.. ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ఎందుకు జరిగింది..? ఎవరి తప్పిదం వల్ల జరిగింది..? అనేది విచారణ తరువాత తేలుతుంది. అయితే విచారణ నివేదిక వచ్చిన తరువాత తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని అల్పలు, లేదా కిందిస్థాయి అధికారులపై చర్యలు తీసుకోవడం మాని. అసలు ప్రమాదమే జరగని స్థాయిలో చర్యలకు ఉపక్రమించాలని పనవ్ ఉద్ఘాటించారు.

అఖిల ప్రియ.. మీరు అతి కొద్దికాలంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయారు. ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి సాటివాళ్ల బాధను వెంటనే అర్థం చేసుకోగలరు. శోభ నాగిరెడ్డి దంపతులు నాకు పీఆర్పీ నుంచి తెలుసు. మీరు వైసీపీలో ఉన్నప్పుడు మీ నాన్న నాకు ప్రత్యర్థి కావాలి. నేను వస్తే ఓడిపోతానంటే.. మీరు అమ్మను కోల్పోయారనే కారణంతో ఎన్డీయేకి మద్దతు ఇచ్చినప్పటికీ నేను నంద్యాలలో ప్రచారం చేయలేదు. నంద్యాల ఉప ఎన్నికల్లోనూ అభ్యర్థిని నిలబెట్టలేదు. పరోక్షంగా రెండుసార్లు మీ విజయానికి తోడ్పడ్డా అని పవన్ మంత్రిని ఉద్దేశించి మాట్లాడారు.

అఖిల ప్రియను తప్పుబట్టడం లేదంటూనే లాల్ బహదూర్ శాస్త్రి ఉదంతాన్ని జనసేనాని ప్రస్తావించారు. లాల్ బహుదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే.. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. అఖిల ప్రియ అలా చేయనక్కర్లేదు. కానీ ఇక్కడికి రావాలి. మీ తప్పేం లేదు. కానీ మంత్రిగా బాధ్యత వహించి.. బాధితులతో మాట్లాడాలి. ప్రజాసమస్యల పట్ల స్పందించకపోతే.. మీది బాధ్యత రాహిత్యం అవుతుంది. మీ కుటుంబంతో ఉన్న అనుబంధం వల్ల చెబుతున్నా. వచ్చి బాధిత కుటుంబాలతో మాట్లాడండి. ఇలాంటి ఘటనలు జరగకుండా.. ఏం చర్యలు తీసుకోవాలో మార్గదర్శకాలు రూపొందించండని సూచించారు.

కాగా జనసేనాని పవన్ కల్యాణ్‌ను చూసేందుకు యువకులు పెద్దఎత్తున తరలివచ్చారు. గత నెలలో విజయవాడ వద్ద కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను శనివారం పవన్ పరామర్శించారు. బాధిత కుటుంబాలను పార్టీ శ్రేణులు ఓ హాలు వద్దకు తీసుకురాగా పరామర్శకు పవన్ విచ్చేస్తున్నారన్న సమాచారం అందుకున్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా యువకులు భారీగా తరలివచ్చారు. అయితే... వీరిని హాలు బయటే పోలీసులు నిలువరించడంతో కార్యక్రమం సాఫీగా జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles