Vishal open letter to the people of TN విశాల్ శాంతించాడు.. భవిష్యత్ కార్యచరణపై దృష్టి..

Not extending support to any other candidate says actor vishal

Vishal Krishna, Actor Vishal, Vishal open letter, R.K. Nagar, RK Nagar by election, nomination, by elections, democracy buried, prakash raj, signatures forged, kanyakumari, fisher man, political stagegy, next political move, ttv dinakaran, stalin, tamil politics

Actor Vishal Krishna’s nomination papers for the bypoll in R.K. Nagar Assembly were rejected by the Returning Officer after two of the 10 persons who proposed his candidature claimed that their signatures had been forged.

విశాల్ శాంతించాడు.. భవిష్యత్ కార్యచరణపై దృష్టి..

Posted: 12/09/2017 10:58 AM IST
Not extending support to any other candidate says actor vishal

అర్కేనగర్ ఉప ఎన్నికలలో బరిలోంచి తన నామినేషన్ ఉపసంహరణ తరువాత తప్పుకున్న ప్రముఖ నటుడు విశాల్.. తన పంథాను మార్చుకున్నాడు. తన నామినేషన్ తిరస్కరణ సమయంలో ఎన్నికల సంఘం అధికారులపై అగ్రహంతో మండిపడిన విశాల్.. కొంత శాంతించినట్లు కనిపించాడు. ముందుగా ప్రకటించినట్లుగా ఉపఎన్నికల బరిలో నిలచిన ఏ స్వతంత్ర్య అభ్యర్థికీ తాను మద్దుతు ఇవ్వడం లేదని చెప్పారు. అందుకు తాను ఇప్పటివరకు అభ్యర్థిని ఎంచుకోకపోవడమే కారణంగా చెప్పారు.

త్వ‌ర‌లో త‌న‌ భవిష్యత్ రాజకీయ‌ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని తెలిపిన విశాల్.. ఈ మేరకు ఆయన ఇవాళ తమిళనాడు ప్రజలకు బహిరంగ లేఖ రాసారు. తన నామినేషన్ ను తిరస్కరణ నేపథ్యంలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. రిటర్నింగ్ అధికారి వేలుసామి తన నామినేషన్ పై సంతకాలు చేసిన పదిమందిలో ఇద్దరు సంతకాలు ఫోర్జరీ అని అరోపించారని అందుచేతే తన నామినేషన్ తిరస్కరించామని చెప్పడం భాదేసిందని అన్నారు. దీంతో దేశంలోనే ప్రజాస్వామ్యాని గోరి కింద పెట్టారని అవేదన వ్యక్తం చేస్తున్నానన్నారు.

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతితో ఖాళీ అయిన ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో పోటీ చేయ‌డానికి విశాల్ నామినేష‌న్ వేయ‌గా, అందులో త‌ప్పులు ఉన్నాయ‌ని ఎన్నిక‌ల అధికారులు నామినేషన్ ను తిర‌స్క‌రించిడంతో అక్రోశంగా తన మనస్సులోని మాటలను బయటపెట్టిన విశాల్.. ఇవాళ బహిరంగ లేఖతో మాత్రం తన కన్నా ప్రస్తుతం అచూకీ తెలియకుండా తప్పిపోయిన కన్యాకుమారి మత్య్సకారుల అంశం ప్రధానమైనదని అన్నారు. ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోని మత్య్సకారులను కనిపెట్టి వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని కోరారు.

తాను ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయ‌డాన్ని కొన‌సాగిస్తాన‌ని, ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌తాన‌ని చెప్పుకొచ్చిన ఆయన తాను పూర్తి స్తాయిలో రాజకీయాల్లోకి తప్పక వస్తానని చెప్పారు. ప్రజల కోసం తన పోరాటం అపపని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తన శాయశక్తులా కృషిచేస్తామని చెప్పారు. తన నామినేషన్ విషయంలో స్పందించి, మద్దతుగా నిలిచిన అర్కేనగర్, తమిళనాడు సమా దేశవ్యాప్తంగా తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన అభిమానులకు, మీడియా ప్రతినిధులకు, పోలీసులు, న్యాయవాదులకు, రాజకీయ నేతలకు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదలు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actor  vishal  open letter  democracy  rk nagar  political stategy  tamil politics  kollywood  

Other Articles