pawan kalyan asks fans to be patient on critics అభిమానులు సహనంతో వుండాలని పవన్ పిలుపు

Pawan kalyan asks fans to be patient on critics which he doesn t care

Jana Sena, Pawan Kalyan, chalore chalore chal, ongole, prakasham, nellore, janasena activists, cine critic, kathi mahesh, akhila priya, nandyal, tourism minister, janasena, TDP, krisha ferry incident, victim familes, , krishna ferry victim families, TDP leaders, wrong propaganda, paritala ravi, tonsure, gundu, ethnic qualities, fatima students, fatima medical college, fatima students pawan kalyan, caste, Indian, human, rajamundry, party activists, telugu states tour, political tour, Andhra Pradesh

Actor turned politician janasena chief power star pawan kalyan suggest fans, and party activists to be patient on critisers. He also says that he doesn't care critics against him.

అభిమానులు సహనంతో వుండాలని పవన్ పిలుపు

Posted: 12/09/2017 12:47 PM IST
Pawan kalyan asks fans to be patient on critics which he doesn t care

చలోరే చలోరే చల్ పర్యటనలో భాగంగా ఒంగోలు పర్యటనలో ఉన్న జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనపై విమర్శలు చేస్తున్న పలువురికి తన ధరణి ఎలాంటిదో చాటిచెప్పారు. తాను విమర్శలను పట్టించుకోను అని తేల్చిచెప్పారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన జనసేన అభిమానులతో సమావేశమైన పవన్.. సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై పరోక్షంగా సెటైర్ వేశారు. ఎవరైనా బలమైన గొంతును వినిపిస్తున్నప్పుడు విమర్శలు చేసేవాళ్లు ఉంటారని ఆయన అన్నారు. ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని చెప్పారు. తాను బంగారాన్ని కాదని... తాను కూడా మనిషినేనని ఆయన అన్నారు.

తనలోని కొన్ని అంశాలు కొందరికి నచ్చుతాయని, కొన్ని అంశాలు కొందరికి నచ్చవని చెప్పారు. తనను ద్వేషించే వ్యక్తులు తన గురించి అలోచించి వారి అమూల్యమైన కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నట్టేనని తెలిపారు. మనిషి నవ్వితే కొంతమేర కండరాలు కదులుతాయని... ఒకరిని ద్వేషించే సమయంలో మాత్రం శరీరం మొత్తం ప్రభావితమవుతుందని... రక్తం పాడవుతుందని, ముఖంలోని కండరాలు పాడవుతాయని చెప్పారు. మీరు కూడా తనలాగానే ఉండాలని జనసేన కార్యకర్తలకు సూచించారు.

దేశ స్వాతంత్ర్య సంగ్రామ సమయంలోనూ మహనీయుల అడుగుజాడ్లలో దేశం యావత్తు నడిచినా.. విమర్శకులు మాత్రం అదే తమ పని అన్నట్లుగా వ్యవహరించారని పవన్ తెలిపారు. వ్యవస్థను సంఘటితంగా మార్పు దిశగా తీసుకువెళ్లే తన ప్రయాణంలో కొందరు వ్యతిరేక వాణిని వినిపించడం సహజమని చెప్పారు. అయితే ఇలాంటి వాటిపట్ల వెంటనే స్పందించకుండా సహనంతో వ్యవహరించాలని పవన్ పిలుపునిచ్చారు. అన అభిమానులను తాను అదే కోరుకుంటానని అన్నారు.

ప్రతి వ్యక్తికి సహనం ఉండాలని... అయితే, మనం చచ్చిపోయేంత సహనం మాత్రం అవసరం లేదని పవన్ అన్నారు. అంతటి సహనాన్ని తాను కూడా భరించలేనని చెప్పారు. సహనంగా వుండాలి అంటే.. దానికి కూడా కొన్ని పరిమితులు వున్నాయని, అవి దాటి కూడా సహనంగా వుండటం బావ్యం కాదని అన్నారు. మనం చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన అవసరం లేదని... అదే సమయంలో ఎదురుదాడి చేయాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. అవసరమైన సందర్భాల్లో స్వీయ రక్షణ చేసుకుందామని చెప్పారు.

ఎవరైనా విమర్శలు చేస్తున్నప్పుడు వారిని పట్టించుకోవద్దని పవన్ అభిమానులకు సూచించారు. దీంతో సమస్య అక్కడితోనే అగిపోతుందని లేనిపక్షంలో, కొన్ని రోజుల తర్వాత అనవసరంగా కొందరిని పెంచి, పెద్దవాళ్లను ఎందుకు చేశామా? అనే మీకు అనిపిస్తుందని అన్నారు. తనను షబ్బీర్ అలీ, దానం నాగేందర్ లు కూడా తిడతారని... కానీ, ఎక్కడైనా ఎదురుపడితే చాలా బాగా మాట్లాడుకుంటామని చెప్పారు. తాను కూడా ఎందరినో ఏదేదో అంటుంటానని, ఆ తర్వాత వారితో మాట్లాడుతూనే ఉంటానని... ఎందుకంటే, అది బేసిక్ కర్టసీ అని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles