rain forecast in telugu states తెలుగు రాష్ట్రాలకు బారిష్ అలర్ట్..

Deep depression in bay of bengal causes rainfall in telugu states

deep depression, bay of bengal, telugu states, rain forecast, heavy rains, odissa, vishakapatnam, climate conditions, weather

vishakapatnam meteorlogical department warns telugu states of partial to heavy rains due to deep depression in bay of bengal

తెలుగు రాష్ట్రాలకు బారిష్ అలర్ట్..

Posted: 11/16/2017 10:47 AM IST
Deep depression in bay of bengal causes rainfall in telugu states

తెలుగు రాష్ట్రాలకు మరోమారు వరుణ గండం పోంచివుంది. రానున్న నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు వున్నాయిని విశాఖ వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఇందుకు కారణం బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండమే. విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని తెలిపింది వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. వాయుగుండం తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం వుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్య్సకారులు అప్రమత్తంగా వుండాలని, వేటకు రెండు రోజుల పాటు వెళ్లకూడదని అధికారుల సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles