CBN Fire on Jagan Comments at Padayatra | బాబు ఆస్కింగ్ : జగన్ ఇంక మారడా?

Chandrababu on jagan speech at padayatra first day

YS Jagan Mohan Reddy, Praja Sankalpa Yatra, Chandrababu Naidu, CBN YS Jaan, Chandrababu on Jagan Padayatra, Jagan Slams Babu at Padayatra

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu fire on YS Jagan's Speech at Padayatra first Day.

జగన్ పద్ధతి ఇంక మారదా?

Posted: 11/07/2017 08:42 AM IST
Chandrababu on jagan speech at padayatra first day

ప్రజా సంకల్ప యాత్ర పేరిట ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టే కొన్ని నిమిషాల ముందు ఏపీ సీఎంపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నానని చెప్పుకుంటూ, యాత్రను ఆరంభించిన తొలిరోజునే వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఎంత వరకూ సరైనదని జగన్ ను బాబు ప్రశ్నించారు.

తెలుగు దేశం పార్టీ వ్యూహ కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై మాట్లాడకుండా, నడక మొదలు పెట్టిన తొలి రోజే తిట్లేంటని విమర్శించారు. జగన్ మైండ్ సెట్ ఇంకా మారలేదని ఎద్దేవా చేశారు. ప్రజలు తమ సమస్యలు ప్రస్తావించాలని పాదయాత్ర చేసే నాయకుల వద్దకు వస్తారని, కానీ జగన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఇదే సమావేశంలో 10వ తేదీ నుంచి అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపైనా చంద్రబాబు సమాలోచనలు జరిపారు. ప్రతిపక్షం అసెంబ్లీలో ఉండదు కాబట్టి, ప్రశ్నోత్తరాల సమయాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. తమతమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించి, సంబంధింత మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కరానికి కృషి చేయాలని చంద్రబాబు కోరారు. ప్రభుత్వ పథకాల అమలులో ఏమైనా లోపాలుంటే తెలియజేయాలని నేతలకు ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles