Hardik Patel Former Friend's Morphed Pics Viral | బీజేపీ లో చేరింది.. మార్ఫింగ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి

Gujarat bjp leader morphed photos viral

Gujarat Elections, Reshma Patel, BJP Woman Leader Morph Pics, Reshma Patel Morphing Pics, Reshma Patel Gujarat High Court, Reshma Patel Crime Branch, Reshma Patel Complaint, BJP Reshma Patel, Ahmadabad Crime Branch Police

Gujarat's BJP Leader Reshma Patel’s morphed photos Viral. on High Court Orders on basis of Reshma's Foster Brother Sunny Patel Complaint, Crime branch on Monday registered an FIR against some fake and genuine IDs on social media for uploading morphed videos, former PAAS member Reshma Patel, who recently joined the BJP.

బీజేపీ రేష్మా అశ్లీల ఫోటోలు వైరల్

Posted: 11/07/2017 09:44 AM IST
Gujarat bjp leader morphed photos viral

గుజరాత్ బీజేపీ మహిళా నేత రేష్మా పటేల్ అశ్లీల చిత్రాల వ్యవహారంపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. నకిలీ ఖాతాలు తెరిచి మరీ ఆమె మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు, అసభ్య కామెంట్లతో కొందరు వాటిని వైరల్ చేశారు.

ఈ మేరకు ఆమెకు వరుసకు సోదరుడు అయ్యే సన్నీ పటేల్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. ఆయా ఫేక్ ఐడీలను కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అసభ్య పదజాలంతో కూడిన ఆమె ఫోటోలను వాట్సాప్, ఫేస్ బుక్ లలో కొందరు వైరల్ చేస్తున్నారంటూ వివరించారు.దీంతో కోర్టు అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు 15 రోజుల్లో కేసును చేధించాలని ఆదేశాలు జారీ చేసింది.

పటీదార్ ఉద్యమకారులు గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మధ్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో హర్దిక్ పటేల్ కు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న ఆమె ఈ మధ్యే బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆమె పరువుకు భంగం కలిగించేలా ఓ వర్గం వారు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles