A MRPS Protester Bharathi Dies During Protest ఎమ్మార్పీఎస్ వీరవనితి భారతి.. కేసీఆర్ సంతాపం

A mrps protester bharathi dies during protest

Bharathi, MRPS activist, heart attack, cardiac attack, KCR, Telangana CM, Telangana assembly, Jana Reddy, Kishan Reddy, TRS, Congress, BJP, politics

MRPS protester has died during the campaign in front of Collectorate of Hyderabad. The CM KCR has released RS 25 lakhs for the Bharati family. MRPS activist died while Dharna at Collectorate.

ఎమ్మార్పీఎస్ వీరవనితి భారతి.. కేసీఆర్ సంతాపం

Posted: 11/06/2017 09:08 PM IST
A mrps protester bharathi dies during protest

ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఇవాళ హైదరాబాద్‌ కలెక్టరేట్ ముందు ఎమ్మార్పీఎస్ చేబట్టిన ఆందోళ‌న‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎమ్మార్పీఎస్‌ ఉద్యమనారి, విరవనిత భారతి అసువులు బాసారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తోపులాటలో భారతి అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌పై ప్రతిప‌క్ష నాయ‌కులు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిల‌దీయ‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రక‌ట‌న చేశారు.

పోలీసులు ఒక్కొక్కరినీ అడ్డుకుని వాహ‌నంలో వేసి త‌ర‌లిస్తున్నారని, ఆందోళ‌న‌లో అస్వస్థత‌కు గురైన‌ ఆమెను హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి త‌ర‌లించార‌ని చెప్పారు. అయితే,  చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారని కేసీఆర్‌ చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై స‌ర్కారు విచార‌ణ జ‌రు‌పుతోందని తెలిపారు. మృతురాలి కుటుంబానికి 25 ల‌క్షల రూపాయ‌ల ఆర్ధిక సాయం అందిస్తామ‌ని ప్రక‌టించారు. అసెంబ్లీలో చ‌ర్చ జ‌రుగుతుండ‌గా బ‌య‌ట ఈ ఘ‌ట‌న చోటు చేసుకుందని అన్నారు.

ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్టక‌రమ‌ని కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అమె కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేశారు. అప్పట్లో ఈ వ‌ర్గీక‌ర‌ణ‌ను ప్రతిపాదించిన వారిలో తాను కూడా ఒక‌రినని అన్నారు. అనేకసార్లు వ‌ర్గీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు తెలిపానని తెలిపారు. ఈ మ‌ధ్య కాలంలో ప్రధాని న‌రేంద్ర మోదీని కూడా క‌లిసి దీనిపై చ‌ర్చించాన‌ని అన్నారు. అఖిల ప‌క్షాన్ని కూడా తీసుకెళ్దామ‌ని అనుకున్నాన‌ని కేసీఆర్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles