'naming liquor brands after women helps boost demand' ‘‘మద్యానికి మగువల పేర్లు.. అమ్మకాలు ఫుల్లు’’

Maharashtra minister apologises for his controversial remarks

Chandrapur, Girish Mahajan, Liquor, Maharashtra, Nandurbar, Nawab Malik, Sugar mill, BJP, Congress, Shiv sena, politics

Under fire for suggesting that the use of feminine brand names would boost liquor sales, Maharashtra minister Girish Mahajan apologised for his remarks.

‘‘మద్యానికి మగువల పేర్లు.. అమ్మకాలు ఫుల్లు’’

Posted: 11/06/2017 08:54 PM IST
Maharashtra minister apologises for his controversial remarks

మ‌ద్యం త‌మ సంసారాలను నాశనం చేస్తుందని ఓపక్క మ‌హిళ‌లు ఆందోళ‌న చెందుతుంటే, మ‌రోవైపు మ‌హారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత‌ గిరీష్‌ మహాజన్ వివాదాస్పద వ్యాఖ్యలు మహిళా లోకాన్ని రెచ్చగొట్టేలా చేస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి కార్యక్రమంలో పాల్గోన్న ఆయన ఆయన నిర్వహించే మద్యం వ్యాపారాలపై నోరు జారారు. మ‌ద్యం విక్రయాలకు గిరాకీ బాగా రావాలంటే వాటికి అమ్మాయిల పేర్లు పెట్టాలని ఉచిత సలహా పారేశారు.

చాలా ఉత్పత్తులకు మహిళల పేర్లు పెట్టి అమ్మకాలు జరుపుతున్నారని, పొగాకు ఉత్పత్తులు అంతగా అమ్ముడు పోవ‌డానికి వాటికి మహిళల పేర్లు పెట్టడమే కార‌ణ‌మ‌ని మంత్రి గిరీష్ అన్నారు. క‌నుక‌ మద్యం షాపుల‌కు ‘మహారాజా’కి బదులు ‘మహారాణి’ అని పేరు మార్చాలని చెప్పారు తనలోకి హస్యచతురతనంతా వినియోగించి చెప్పారు. అక్కడ సభలో మంత్రి కామెంట్లపై నవ్వుల పువ్వులు విసిరాయి. అయితే భయట మాత్రం అగ్గిరాజుకుంది.

మహిళా లోకం మ‌హారాష్ట్ర నీటి వ‌న‌రుల మంత్రి గిరీష్ మ‌హ‌జ‌న్ చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. సోమవారం ఎక్కడికక్కడ ఆయన వ్యాక్యలకు వ్యతిరేకంగా నిరసనలు, అందోళనలు చేపట్టింది. మ‌హిళా సంఘాల నేత‌లు, సామాజిక వాదులు, ప్రతిప‌క్ష కాంగ్రెస్ నాయ‌కులు వ్యతిరేక‌త వ్యక్తం చేశారు. దీంతో దిగి వచ్చిన మంత్రి ఈ వివాదంపై స్పందిస్తూ... 'నా వ్యాఖ్యల‌కు ప‌శ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను. క్షమాప‌ణ‌లు అడుగుతున్నాను. మ‌హిళ‌ల మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచే ఉద్దేశం నాకు లేదు' అన్నారు. ఈ విష‌యం గురించి తాను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫ‌డ్నవీస్‌తో కూడా చ‌ర్చించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrapur  Girish Mahajan  Liquor  Maharashtra  Nandurbar  Nawab Malik  Sugar mill  BJP  Congress  Shiv sena  politics  

Other Articles