party activist died at YS Jagan praja sankalpa yatra ప్రజాసంకల్ప యాత్రలో అపశృతి.. కార్యకర్త మృతి

Party activist dies of cardiac arrest at ys jagan praja sankalpa yatra

ck dinna, venkataramana, cardiac arrest, YSR congress, Paradise Papers, Panama Papers, YS Jagan, Praja sankalpam, India, Tax haven, Bermuda law firm, Appleby, ICIJ

A party activist of Ysr congress party venkata ramana belongs to ckdinna, dies of cardiac arrest on the very first day of YS Jagan praja sankalpa yatra.

ప్రజాసంకల్ప యాత్రలో అపశృతి.. కార్యకర్త మృతి

Posted: 11/06/2017 04:12 PM IST
Party activist dies of cardiac arrest at ys jagan praja sankalpa yatra

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి.. రానున్న ఎన్నికలలో అధికారమే పరమావధిగా భావించి ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్ర లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇడుపుల పాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద అశ్వీరాదం తీసుకుని.. తన తల్లి విజయమ్మ ఆశీస్సులు పోంది విజయమే పరమావధిగా ప్రారంభించిన పాదయాత్ర ఇప్పటికే పలు అటంకాలను ఎదుర్కొని ఎట్టకేలకు ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే.

అయితే ఇవాళ పాదయాత్రను ప్రారంభించేందుకు ముందు ఆయన పేరు ప్రపంచ నల్లకుబేరుల జాబితాలో వున్నట్లు ఇండియన్ కన్సోర్టియమ్ అప్ ఇంటర్నేనేషనల్ జర్నలిస్ట్ విడుదల చేసిన తాజా జాబితాలో జగన్ పేరు ప్రముఖంగా నిలిచింది. చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన విమర్శలు సంధిస్తున్న క్రమంలో నల్లకుబేరుడిగా ఆయన అర్హతను ఈ ప్యారడైజ్ పేపర్లు సవాల్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

ఈ అరోపణల నేపథ్యంలో వాటిని ధీటుగానే ఎదుర్కుంటూ పాదయాత్రను ప్రారంభించి.. ముందుకు సాగుతున్న జగన్.. ఇడుపులపాయ బయటకు వచ్చే దారి నుంచి స్థానిక ప్రాంతాలలో ఇవాళ పాదయాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో జగన్ వెంట తాను పాదయాత్ర చేయలాని సంకల్పించి.. పాదయాత్రలో పాల్గోన్న ఓ కార్యకర్త అకస్మిక మృతి వైసీసీ పార్టీ శ్రేణులు, అధినేత జగన్ ను విషాదంలోకి నెట్టింది. సీకెదిన్నెకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి గుండెపోటుతో అకస్మికంగా మరణించాడు. వెంకటరమణ కుటుంబానికి తాము నిత్యం అండగా వుంటామని జగన్ భరోసా ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles