students accuses sanskrit lecturer of molestation ప్రోఫెసర్ చీకటి కోణాలు.. చితకబాదిన విద్యార్థులు

Andhra university sanskrit lecturer manhandled by students union

Andhra University, sanskrit Professor, sanskrit lecturer, manhandle, students union, sexually harassment, girl students, women students, vishakapatnam, crime

Andhra University sanskrit lecturer manhandled by students union after alleging that he is sexually harassing girl students.

ప్రోఫెసర్ చీకటి కోణాలు.. చితకబాదిన విద్యార్థులు

Posted: 11/06/2017 03:25 PM IST
Andhra university sanskrit lecturer manhandled by students union

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరో ప్రొఫెసర్ చీకటి కోణాలు వెలుగు చూశాయి. ఈ అంశంలో ఫ్రొఫెసర్ కు విద్యార్థి సంఘాల నేతలకు మధ్యవాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఓ దశలో విద్యార్థి సంఘాల నేతలు ప్రోఫెసర్ పై బౌతికదాడులకు కూడా తెగబడ్డారు. దీంతో కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక విద్యార్థి సంఘాల అధ్వర్యంలో విద్యార్థులు కాలేజీ అవరణలో అందోళన కార్యక్రమానానికి పూనుకున్నారు.

మార్కులు కావాలంటే తనను శారీరికంగా తృఫ్తి పర్చాలని మహిళా విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న సాంస్కృత విభాగాధిపతి ఏడుకొండలు అంశాన్ని విద్యార్థి సంఘాల దృష్టికి తీసుకువెళ్లారు విద్యార్థినులు. దీంతో విద్యార్థి సంఘాల నేతలు ఫ్రోపెసర్ ను నిలదీశారు. మహిళా విద్యార్థినులను లైంగికంగా ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నించారు. ఆందోళన చేపట్టి, ప్రొఫెసర్‌పై దాడికి దిగారు.

అనంతరం బాధిత విద్యార్థినులు మీడియాతో మాట్లాడుతూ.. చాలా కాలం నుంచి తమను ప్రత్యేకంగా గదిలోకి పిలిపించి వారితో అసభ్యంగా మాట్లాడేవాడని, క్లాస్ రూంలో పాఠాలు చెప్పే సమయంలోనూ శృంగారానికి సంబంధించిన మాటలు మాట్లాడేవాడని విద్యార్థినులు అరోపించారు. గతంలోనూ ఈ ప్రోఫెసర్ పై ఇటువంటి ఎన్నో ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ మధ్యకాలంలో వేధింపులు ఎక్కువయ్యాయని, తాను చెప్పినట్టు వినకుంటే అంతూ చూస్తానని బెదిరిస్తున్నాడని విద్యార్థులు తెలిపారు.

వేధింపుల ఫ్రొఫెసర్ ను అరెస్ట్ చేసేవరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. అయితే ఏడుకొండలు మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు అన్ని అవాస్తవాలని బుకాయిస్తున్నాడు. విద్యార్థుల అటెండెన్స్ తక్కువగా ఉందని పరీక్షకు అనుమతించలేదని కావాలనే తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై మంత్రి గంటా శ్రీనివాస రావు స్పందించారు. దీనిపై ఏయూ రిజిస్ట్రార్ తో మాట్లాడిన మంత్రి గంటా వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles