tollywood actor and writer mvs haranatha rao passed away సినీ రచయిత, నటుడు హరనాథరావు కన్నుమూత..

Tollywood actor and writer mvs haranatha rao passed away

MVS Haranatha Rao, Cinema writer, Actor, stage artist, prathigatana, bharata nari, t.krishna, swayam krushi, suthradharulu, ammayi kapuram, anna, tollywood

Another big shock to tollywood as renowned writer and actor mvs haranatha rao passed away in his own house at prakasham this morning

సినీ రచయిత, నటుడు హరనాథరావు కన్నుమూత..

Posted: 10/09/2017 12:57 PM IST
Tollywood actor and writer mvs haranatha rao passed away

తెలుగు సినీ అభిమానులను అలరించే చక్కని కథలను, మాటలను అందించిన ప్రముఖ సినీ రచయిత, నటుడు, స్టేజీ అర్జిస్టు ఎంవీఎస్ హరనాథరావు(72) కన్నుమూశారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో తన సొంతింట్లోనే ఆయన ఇవాళ గుండెపోటుతో మరణించారు. అకస్మికంగా వచ్చిన గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఆయనను అసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మృతిచెందినట్లు సమాచారం. హరినాథరావుకు భార్య, ముగ్గురు కుమార్తులు ఉన్నారు. 150కు పైగా సినిమాలకు కథలు, మాటలు, రచనలు అందించిన ఆయన నాలుగు చిత్రాలకు గాను నంది పురస్కారాలను కూడా అందుకున్నారు.

ఓ వైపు విప్లవాత్మకైమైన చిత్రాలతో తన ప్రతిభను చాటుతూనే.. మరోవైపు అచ్చతేట తెలుగు చిత్రాలకు కూడా ఆయన పనిచేసి తనలోని భిన్న కోణాలను అవిష్కరింపజేశారు. ఎంవీఎస్‌ హరనాథరావు.. ప్రతిఘటన, భారతనారీ, అన్న, అమ్మాయి కాపురం సినిమాలకు సాహిత్యం అందించినందుకు నంది పురస్కారాల్ని గెలుపొందారు. ప్రముఖ దర్శకుడు టీ కృష్ణ ద్వారా తెలుగు సినిమాకు పరిచయం అయిన హరనాథరావు.. స్వయంకృషి, ప్రతిఘటన, సూత్రధారులు వంటి అవార్డులు గెలుపొందిన సినిమాలకు కథ, మాటలు అందించారు. అంతేకాకుండా ఆయన స్వయంకృషి, ప్రతిఘటన వంటి సినిమాల్లో నటించారు.

గుంటూరులో చదువుకున్న హరనాథరావుకు చిన్నప్పటినుంచే నాటకాల అంటే అభిమానం.  చిన్నప్పుడు నాటకాల్లో పాత్రలు పోషించిన ఆయన.. అనంతరం పలు నాటకాలు రచించారు. కాలేజీలో రోజుల్లో దర్శకుడు టీ కృష్ణ, హరనాథరావు మంచి స్నేహితులు. అనంతరకాలంలో టీ కృష్ణ ద్వారా సినిమాలకు పరిచయం అయిన హరనాథరావు.. ప్రతిఘటన, భరతనారీ, ఇదా ప్రపంచం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, రేపటి పౌరులు, మంచి దొంగ, యుద్ధభూమి, రాక్షసుడు, ధర్మచక్రం వంటి సినిమాలకు రచయితగా పనిచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MVS Haranatha Rao  Cinema writer  Actor  stage artist  passed away  tollywood  

Other Articles