Supreme Court says no to firecrackers this Diwali దీపావళి దీపాల కాంతులే.. టపాసులపై ‘సుప్రీం’ నిషేధం

Supreme court rules for ban on firecrackers sale during diwali in delhi

diwali, green diwali, students, delhi students, delhi schools, fire crackers, eco-friendly diwali, smoke-free Diwali, Supreme Court, Fireworks, firecrackers, Diwali, Delhi-NCR, no pollution, latest news

Students in Delhi schools would be made aware of environmental pollution and health hazards due to extensive bursting of fire crackers to make them the ambassadors of change to celebrate an eco-friendly and green Diwali, the Supreme Court was told today.

దీపావళి దీపాల కాంతులే.. టపాసులపై ‘సుప్రీం’ నిషేధం

Posted: 10/09/2017 01:46 PM IST
Supreme court rules for ban on firecrackers sale during diwali in delhi

దీపావళి అంటే దీపాల వరుస.. అదే అర్థాన్ని సార్థకం చేస్తూ.. ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గతంలో జరిగినట్లు కాకుండా ఈ సారి విభిన్నంగా ఎకో దీపావళిని నిర్వహించుకోవాలని, గ్రీన్ దీపావళి అవశ్యకతను రేపటి భావితరాలకు కూడా తెలియజేయాలని సూచించింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దేశరాజధాని ఢిల్లీలో టపాసుల విక్రయాలపై నిఫేధాన్ని విధఇంచింది. పోగ రహిత దీపావళి సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం అదేశాలను ఇచ్చింది.

దేశ రాజధానిలో పూర్తిగా కాలుష్యం కొరల్లో చిక్కకుపోవడంతో.. దీపావళి పటాసుల వల్ల కూడా ఉత్పన్నమయ్యే కాలుష్యం.. పర్యావరణానికి సవాలుగా పరిణమిస్తున్న నేపథ్యంలో దాని నియంత్రణకు సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయాన్ని తీసుకుంది, దీంతో పాటు గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దేశ రాజధాని ఢిల్లీ సహా పరిసర పట్టణాలు, నగర ప్రాంతాలలో ఎక్కడా దీపావళి టపాసులను విక్రయించకుండా పూర్తిగా నిషేధాన్ని విధించింది. తమ నిషేధాజ్ఞలు నవంబర్ 1వ తేదీ వరకు అమల్లో వుంటాయని కూడా పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దుకాణాదారులు పోలీసుల నుంచి టపాసుల విక్రయానికి పోందిన లైసెన్సులను కూడా రద్దు చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. కాలుష్యరహితంగా దీపావళి పండుగ పర్వదినాన్ని జరుపుకోవాలని న్యాయస్థానం సూచనలు జారీ చేసింది. శబ్ధ, వాయు కాలుష్యం ఎక్కువగా వచ్చే బాంబులపై నిషేధం కొనసాగుతుందని సుప్రీం స్పష్టం చేసింది. నవంబర్ 1 తర్వాత నిషేధం తాత్కాలికంగా సడలిస్తామని ప్రకటించింది. సర్వోన్నత న్యాయస్థానం అదేశాలతో ఢిల్లీలో బాణాసంచా అమ్మకాలను నిలిపివేస్తున్నారు. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజన్ ప్రాంతాల్లో ఇది అమల్లో ఉంటుంది.

గతేడాది నిషేధాజ్ఞలు అమల్లో వున్నా.. టపాసులతో  వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. మూడు రోజులు పాటు కాలుష్యం వాతావరణంలో వుండిపోయిందని.. దీంతో చాలా మంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రి పాలయిన విషయాన్ని గుర్తుచేసిన కోర్టు.. తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తూ.. లైసెన్స్ లు సగానికి తగ్గించాలని ఆదేశిస్తూ కింది కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో అర్జున్ గోపాల్ అనే వ్యక్తి పిటీషన్ వేయడంతో దానిని విచారించిన సుప్రీం ఈ మేరకు తాజా అదేశాలను జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Fireworks  firecrackers  Diwali  Delhi-NCR  no pollution  

Other Articles