Gujarat High Court commutes death to life term 'గోద్రా రైలు దహనం' కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు..

Gujarat hc commutes death sentence to 11 convicts into life imprisonment

Godhra train carnage, Godhra Train case verdict, Godhra, Gujarat Hih court, Life sentence, death sentence, SIT,Murder,Gujarat,Godhra riots,Godhra case,Ayodhya

The death sentences handed to 11 of the 31 convicts, were commuted to rigorous life imprisonment by the Gujarat High Court, in the Godhra Sabarmati Express burning case,

'గోద్రా రైలు దహనం' కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు..

Posted: 10/09/2017 12:16 PM IST
Gujarat hc commutes death sentence to 11 convicts into life imprisonment

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గోద్రా రైలు దహనం కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సబర్మతీ ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పు పెట్టిన ఘటనలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును రమారమి సానుకూలంగా వుందని చెప్పిన రాష్ట్రోన్నత న్యాయస్థానం.. ఈ కేసులో పెద్ద సవరణను చేసింది. ఈ కేసులో 11 మంది దోషులకు ఉరిశిక్షను విధించాలని కింది కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోుర్టు సవరించింది. పదకొండు మంది దోషులకు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చేస్తూ తీర్పును వెలువరించింది.

ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని అగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. మృతుల కుటుంబాలకు అరు వారల్లోపు నష్టపరిహారం అందేట్లు చూడాలని కూడా అదేశించింది. ఫిబ్రవరి 27, 2002న సబర్మతీ ఎక్స్ ప్రెస్ లోని ఎస్-6 కోచ్ ని గోద్రా జంక్షన్ రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు 20 వేల మంది అందోళనకారులు చుట్టుముట్టి తగులబెట్టగా, 59 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
 
ఈ ఘటనలో మొత్తం 94 మంది నిందితులైన ముస్లింలపై కేసులు నమోదు చేసిన ప్రత్యేక దర్యాఫ్తు బృందం వారిపై చార్జ్ షీట్ లను దాఖలు చేసింది. కేసు విచారణ సుదీర్ఘకాలం సాగగా, నిందితుల్లో 63 మందిపై సాక్ష్యాలు లేని కారణంగా ఆరోపణలను కొట్టేసిన సిట్ కోర్టు, మిగిలిన 31 మందిని నేరస్తులుగా నిర్థారించి, వారిలో 11 మందికి మరణశిక్ష, మిగిలినవారికి జీవిత ఖైదును విధించింది. మరణశిక్ష పడిన వారు అపీలు చేసుకోగా, విచారించిన హైకోర్టు, వారి శిక్షను కూడా జీవిత ఖైదుగా మారుస్తూ కొద్దిసేపటిక్రితం తీర్పిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles