Court grants bail to three gangrape convicts గ్యాంగ్ రేప్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు..

High court shames rape victims promiscuous attitude

India, Haryana, Punjab and Haryana High Court, rape, sexual assault, crimes against women, Justice Mahesh Grover, Justice Raj Shekhar Attri, law students, Hardik Sikri, Vikas Garg, Karan Chhabra, gangrape, victim shaming, jindal law school, op jindal, sonepat, crime

The Punjab and Haryana High Court granted bail to three former law students who were convicted of gangrape on the grounds that the complainant’s statement stemmed from a “promiscuous attitude and a voyeuristic mind

గ్యాంగ్ రేప్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు..

Posted: 09/22/2017 10:47 AM IST
High court shames rape victims promiscuous attitude

హర్యానాలో సంచలనం సృష్టించిన జిందాల్ న్యాయ విద్యార్థిని అత్యాచార కేసులోని నిందితులకు చంఢీగడ్ హైకోర్టులో ఊపశమనం లభించింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా డిజిటల్ అధారాలను పరిగణలోకి తీసుకుని తమ సహచర న్యాయవిద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులలో ఇద్దరికి ఇరవై ఏళ్లు, మరోకరికి ఏడేళ్ల జీవిత ఖైదు శిక్షను ఖారరు చేసిన కింది కోర్టు తీర్పును కొట్టివేస్తూ చండీగఢ్ హైకోర్టు తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. మొట్టమొదటిసారిగా వాట్సాప్‌ ఛాటింగ్‌ను సాక్ష్యంగా పరిగణిస్తూ నిందితులకు శిక్షలు ఖరారు చేసినా అది ఉన్నత న్యాయస్థానంలో నిలువలేకపోయింది.
 
ఈ సందర్భంగా హైకోర్టు ద్విసభ్య బెంచ్‌ బాధితురాలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం విశేషం. బాధితురాలి మానసిక పరివర్తనే జరిగిన అఘాయిత్యానికి కారణమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ‘కాస్త కూడా పరిణితి లేకుండా అమ్మాయి వ్యవహరించింది. యువకులతో మరీ సానిహిత్యంగా మెలిగింది. పైగా లైంగిక పరమైన కోరికలతోనే స్నేహితులతో అసభ్యమైన ఛాటింగ్ చేసిందని ఈ విషయాలన్ని యువతి విచారణలో అంగీకరించిందని పేర్కోంది. వైద్యులు కూడా యువతి మానసిక ప్రవర్తన సరిగ్గా లేదన్న విషయాన్ని తేల్చారని బెంచ్ తెలిపింది.

యువతి మానసిక స్థితి సరిగా లేనప్పుడు బలవంతంగా లైంగిక దాడి చేశారన్న ఆరోపణలు సరికాదని అభిప్రాయపడింది. అదే సమయంలో నిందితులలో ఇద్దరికి ఏకంగా 20 ఏళ్లు, మరోకరికి ఏడేళ్ల కఠిన కారాగారా శిక్షను కూడా విధించాల్సిన అవసరం లేదని బెంచ్‌ పేర్కొనింది. విద్యార్థుల భవిష్యత్తును కూడా పరిగణనలోకి తీసుకునే తాము ఈ తీర్పు వెలువరిస్తున్నామని జడ్జిలు మహేష్ గ్రోవర్‌, రాజ శేఖర్‌ అట్టిరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే బాధితురాలికి నిందితులు పది లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని అదేశించింది.
 
సోనేపట్‌ లో ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో హార్దిక్ సిక్రీ, కరణ్ ఛాబ్రా, వికాస్ గార్గ్‌ అనే విద్యార్థులు తమ జూనియర్‌ అమ్మాయిపై రెండేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు.  ఆమె నగ్న చిత్రాలను సేకరించి, అందరితో పంచుకోవడంతో పాటు, యాపిల్ ఐ క్లౌడ్ లో దాచారు. వీరి మధ్య సాగిన అన్ని సంభాషణలు వాట్సాఫ్ లో భద్రంగా ఉండిపోయాయి. వీటి అధారంగా నమోదైన కేసును విచారించిన సోనీపేట్ కోర్టు నిందితులను దోషులుగా పరిగణించి శిక్షలను ఖారారు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Haryana  High Court  rape  gangrape  victim shaming  convicted  law students  jindal law school  sonepat  crime  

Other Articles