Seven coaches of Shaktipunj Express derail in UP యూపీలో పట్టాలు తప్పిన శక్తిపుంజ్ ఎక్స్ ప్రెస్.. అనుమానాలు..

7 coaches of shaktipunj express derail in up s sonbhadra district

train derailment, Uttar Pradesh, sonbhadra district, Obara Railway Station, shaktipunj express, suresh prabhu, piyush goel, suspect, anti social elements, crime

Seven coaches of the Shaktipunj Express have derailed near Obara Railway Station in Sonbhadra, Uttar Pradesh. The train was on its way to Jabalpur from Howrah.

యూపీలో పట్టాలు తప్పిన శక్తిపుంజ్ ఎక్స్ ప్రెస్.. అనుమానాలు..

Posted: 09/07/2017 09:20 AM IST
7 coaches of shaktipunj express derail in up s sonbhadra district

ఉత్తర్ ప్రదేశ్ లో ఇవాళ వేకువజామున మరో ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురయ్యింది. అయితే ప్రయాణికులెవ్వరికీ ఏలాంటి గాయాలు కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇవాళ ఉధయం జబల్ పూర్ నుంచి హౌరాకు వెళ్తున్న శక్తిపుంజ్ ఎక్స్ ప్రెస్ రైలు సోన్ భద్ర జిల్లాలోని ఒబరా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. వరుస ప్రమాదాలకు నిలయంగా మారిన ఉత్తర ప్రదేశ్ లోనే ఈ ఘటన చోటుచేసుకోగా, ఈ ఘటనపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
 
కాగా, ఈ ప్రమాదంలో శక్తికుంజ్ ఎక్స్ ప్రెస్ రైలుకు సంబంధించి ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఒక్కరిద్దరికీ గాయాలైనా అవి స్వల్పగాయాలని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ ప్రమాదానికి రైలు పట్టా విరిగిపోయి ఉండటమే కారణంగా అనుమానిస్తున్న అధికారులు ఈ ప్రమాదంలో సంఘవ్యతిరేక శక్తుల హస్తం వుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు పూరైన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు.

కాగా ప్రయాణికులందరినీ సురక్షితంగా ఇతర బోగీల్లలో కూర్చునే సదుపాయాన్ని కల్పించి.. ఇవాళ ఉదయం 7.28 గంటలకు రైలు నిర్ధేశిత ప్రాంతానికి తరలించామని అధికారులు తెలిపారు. అయితే ప్రమాదం సంభవించిన సమయంలో రైలు కేవలం గంటలకు 40 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తున్నందున ప్రమాదంలో పెద్దగా ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే అధికారులు రైల్వే శాఖ అధికార ప్రతినిధి అనీల్ సక్సెనా తెలిపారు. కాగా రైలు ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ కు కూడా సమాచారం అందించామని అయన చెప్పారు.
 
గత నెల నుంచి వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను అందోళనకు గురిచేస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకోవడం ఇది ఐదోవసారి. గత నెలలో  19న హరిద్వార్ నుంచి ఉత్తరాఖండ్ కు వెళ్తున్న కలింగా ఉత్కల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురై ఏకంగా 23 మంది ప్రాణాలను బలితీసుకుంది. అంతకుముందు ముంబై లోని లోకల్ రైలు కూడా పట్టాలు తప్పిగా ఈ ప్రమాదంలో కూడా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

ఇక గత నెల 23న ఖియాఫత్ ఎక్స్ ప్రెస్ రైలు ఉత్తర్ ప్రదేశ్ లో పట్టాలు తప్పడంతో 50 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఆ తరువాత గత నెల 29 ముంబై నుంచి వెళ్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో కూడా రైలు నిదానంగా వెళ్తుండడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇక తాజాగా శక్తికుంజ్ రైలు పట్టాలు తప్పింది. ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు తన పదవికి రాజీనామా చేయగా, రైల్వేశాఖను మరో మంత్రి పీయూష్ గోయల్ కు ప్రదాని అప్పగించారు. అయితే పీయూష్ గోయల్ బాధ్యతలు చేపట్టాక జరిగిన తొలి ప్రమాదం ఇదే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles