nandamuri jayakrishna sentenced for six months jail నందమూరి వారసుడికి జైలు శిక్ష.. అరెస్టు

Nandamuri jayakrishna sentenced for six months jail

Erramanzil court, nandamuri jayakrishna, six months jail sentence, RS 25 lakhs penalty, cheque bounce case, ramakrishna theatre, abids, canteen, parking, narsinga rao

The Erramanzil court today sentenced nandamuri jayakrishna for six months jail and penalty of ruppees 25 lakhs in a cheque bounce case.

నందమూరి వారసుడికి జైలు శిక్ష.. అరెస్టు

Posted: 09/06/2017 08:16 PM IST
Nandamuri jayakrishna sentenced for six months jail

నందమూరి వారసుడు అన్న స్వర్గీయ ఎన్టీరామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణకు ఇవాళ ఎర్రమంజిల్ కోర్టు జైలు శిక్షను విధించింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీయార్ తనయుడైన జయకృష్ణ అబిడ్స్ లోని రామకృష్ణ థియేటర్ కు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటున్నారు. అయితే ఈ థియేటర్ కు సంబంధించిన అంశంలో ఆయన ఇచ్చిన చెక్ బౌన్సు కావడంతో ఆయనకు ఆరు నెలల కారాగారవాసం శిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. శిక్షతోపాటు రూ.25 లక్షల జరిమానాను కూడా న్యాయస్థానం విధించింది.

రామకృష్ణ థియేటర్‌ క్యాంటిన్‌, పార్కింగ్‌ లీజుకు సంబంధించిన వివాదంలో నందమూరి జయకృష్ణ ఇచ్చిన చెక్కు బౌన్స్‌ కావడంతో నర్సింగరావు అనే వ్యక్తి ఎర్రమంజిల్‌లోని మూడో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ అనంతరం జయకృష్ణను దోషిగా పేర్కొన్న న్యాయస్థానం అతనికి అరు నెలల కఠిన కారాగారవాసంతో పాటు, భారీ జరిమానాను కూడా విధించింది. ఈ తీర్పును సవాలు చేసేందుకుగానూ జయకృష్ణకు నెల రోజుల గడువు ఇచ్చింది. దీంతో అతని తరపు న్యాయవాదులు బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా న్యాయస్థానం సమ్మతించడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles