India Must Be Prepared For Two-front War: Army Chief యుద్దానికి సిద్దంకావాలంటూ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

India must be prepared for two front war army chief

bipin rawat, army chief on china, doklam, army on doklam, india china, Army chief General, Bipin Rawat, war, China and Pakistan, India, Indian army, indian army doklam standoff, bipin rawat doklam

A week after India and China ender their to-and-a-half month long conflict Army chief general Bipin Rawat said that the country should be prepared for a two-front war against China.

యుద్దానికి సిద్దంకావాలంటూ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Posted: 09/07/2017 09:57 AM IST
India must be prepared for two front war army chief

పోరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో ఇండియన్ అర్మీ సమరానికి సిద్దం కావాలంటూ భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 73 రోజలు పాటు డోక్లాం వద్ద ఏర్పాడిన ప్రతిష్టంభన, ఇరు దేశాల సైనికుల మధ్య ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం పరిణామాలపై ఆయన స్పందిస్తూ.. ఇలాంటి సంఘటనలు చాలా సులువుగా పరిష్కారం అవుతాయి లేదా.. పెరిగి పెరిగి పెద్దగా మారి.. యుద్దనికి కూడా దారి తీయవచ్చునంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశాన్ని దురాక్రమించేందుకు చైనా యత్నిస్తున్న నేపథ్యంలో.. యుద్దం తప్పకపోవచ్చనన్న సంకేతాలను అయన ఆర్మీకి అందించారు.

‘సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ ఫేర్ స్టడీస్’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో రావత్ మాట్లాడారు. చైనా మన దేశాన్ని అక్రమించేందుకు యత్నించింది. అత్యంత కీలకమైన ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులను చేపట్టి.. తన అధిపత్యాన్ని ప్రదర్శించేందుకు యత్నించింది. ఈ క్రమంలో తాత్కాలికంగా చైనా తన బలగాలను ఉపసంహరించుకున్నా.. మళ్లి కాలుదువ్వు చర్యలకు పాల్పడే అవకాశాలు వున్నాయని.. అందుకనే భారత బలగాలు చైనాను ఎదుర్కొనేందుకు ద్విముఖ వ్యూహంతో సిద్దంకావాలని రావత్ పేర్కొన్నారు.

ఇక పాకిస్తాన్‌తో రాజీ కుదిరే మార్గమే కనిపించడం లేదని రావత్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో చైనాతో పాటు పాకిస్తాన్ తో కూడా కలిసి యుద్ధం చేసేంతవరకు డోక్లాం వివాదం దారి తీయవచ్చునని అన్నారు. ఏదేమైనా ఆర్మీ సిద్ధంగా ఉండాలన్నారు. దేశం బయటి నుంచి వచ్చే ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కోవాలంటే త్రివిధ దళాల్లో ఆర్మీకి అధిక ప్రాధాన్యతను కొనసాగించాల్సిందేనన్నారు.  కాగా, ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు భేటీ అయ్యి, ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను ప్రోత్సహించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో రావత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Army chief General  Bipin Rawat  war  China and Pakistan  India  Indian army  

Other Articles