SC directs states to appoint nodal officer to curb gorakshaks గోరక్షకుల హింసపై సుప్రీం సీరియస్.. నియంత్రణచర్యలకు అదేశం

Supreme court directs states to appoint nodal officer to curb cow vigilantism

cow, cow vigilantism, Gorakshak, SC, Supreme Court, Dipak Misra, Chief Justice Dipak Misra, state governments, nodal officer, beef, lynching, Tushar Gandhi, Task Force

The bench headed by Chief Justice Dipak Misra directed chief secretaries of each state to file a status report giving details of action taken to prevent incidents of cow vigilantism.

గోరక్షకుల హింసపై సుప్రీం సీరియస్.. నియంత్రణచర్యలకు అదేశం

Posted: 09/06/2017 06:09 PM IST
Supreme court directs states to appoint nodal officer to curb cow vigilantism

సాధు జంతువులైన గోవుల పరిరక్షణను చేపడుతున్న గో రక్షకులు.. అ పేరుతో తమతోటి మనుషులపై సాగిస్తున్న హింసాకాండపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గో రక్షణ పేరిట జరుగుతున్న దాడులను నియంత్రించాలని అదేశాలను జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో టాక్స్ ఫోర్స్ టీమ్ లు వుండాలని, వీటికి ప్రతీ జిల్లాలలో సీనియర్‌ పోలీసు అధికారి నోడల్ అధికారిగా వ్యవహరించేలా నియామకాలను చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

గో రక్షణ పేరుతో.. కొందరు అమాయక దళితులు, మైనారిటీలపై నేరాలు గోవధ చేశారని, గోమాంసం తరలిస్తున్నారన్న అనుమానాలతో దాడులకు తెగబడి.. వారి ప్రాణాలతో చెలగాటం అడటమేంటని సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాలను ప్రశ్నించింది. గో రక్షణ పేరుతో అరాచకాలు, హింసాత్మక దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త తెహసీన్‌ ఎస్‌ పూనావాలా గత ఏడాది అక్టోబర్‌ 21న దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ఈ మేరకు అదేశాలను జారీ చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 27న ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం.. దీనిపై ప్రతిస్పందన తెలియజేయాలని దాడులు జరిగిన ఆరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. గత జూలై 21న వాదనల సందర్భంగా దాడులకు దిగుతున్న గో రక్షకులను కాపాడాలని చూడొద్దని, గో రక్షణ పేరిట జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలేమిటో తెలుపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా ఇవాళ జరిపిన విచారణ సందర్భంగా గో రక్షణ దాడులకు వ్యతిరేకంగా వారం రోజుల్లో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేయాలని రాష్ట్రాలను సుప్రీం అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cow  cow vigilantism  Supreme Court  Dipak Misra  state governments  nodal officer  beef  lynching  Tushar Gandhi  

Other Articles