all ast for kakinada municipal corperation elections countingl కాకినాడ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

All set for kakinada municipal corperation elections counting

MCK poll results live updates, MCK, MCK news, MCK results, kakainada, MCK results, counting centres, chandrababu, YS Jagan, Tdp, bjp, YSRCP, congress

East godavari district collector karthekeya misha says all arrangement are made for kakinada municipal corperation elections counting

కాకినాడలోనూ తొడగొడుతున్న కాయ్ రాజా కాయ్ బాబులు..

Posted: 08/31/2017 06:20 PM IST
All set for kakinada municipal corperation elections counting

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం జరగనున్న నేపథ్యంల కౌంటింగ్ కు సంబంధించి అన్నీ ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులతో భారీ భద్రత  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని, ప్రతి గంటకు 14 వార్డుల ఫలితాలు వెల్లడయ్యే అవకాశముందని కలెక్టర్ చెప్పారు.

మొత్తం 48 వార్డులు వున్నాయి కాబట్టి ఉదయం 10 గంటలలోపు ఫలితంపై స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్టను చేస్తున్నామని చెప్పారు. కాగా ఎన్నికల కమీషన్ నుంచి మరొక నోటిఫికేషన్‌ వచ్చాక మేయర్‌ ఎన్నిక నిర్వహిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఇదిలావుండగా సందెట్లో సడేమియాలు మాత్రం కాకినాడ ఎన్నికలపై కాయ్ రాజా కాయ్ అంటున్నారు.
 
నంద్యాల ఉపఎన్నికపై దాదపు రూ.వంద కోట్ల వరకు పందాలు కట్టిన పందెంరాయుళ్లు.. కాకినాడ ఎన్నికలలో కూడా ఏ మాత్రం తగ్గకుండా ఏ వార్డులో ఎవరు విజయాన్ని సాధిస్తారు. ఎంత మెజారిటీ ఇలా అంశాలవారీగా బెట్టింగ్ సాగుతూ రూ. 50 కోట్లను కూడా క్రాస్ చేసిందని టాక్. ఇక అధికమంది కాకినాడ మేయర్ పీఠాన్ని ఏపార్టీ కైవసం చేసుకుంటుంది?... ఏ పార్టికి ఎన్ని డివిజన్లు వస్తాయి అనే అంశాలపై బెట్టింగ్ కాస్తున్నారు. అదే విధంగా టీడీపీ, వైసీపీలు ఎన్ని డివిజన్లు గెలుచుకుంటాయనేది కూడా పందానికి ప్రధాన వనరుగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kakainada  MCK results  counting centres  chandrababu  YS Jagan  Tdp  bjp  YSRCP  congress  

Other Articles