జగన్ కు మరో షాక్.. సీబీఐ కోర్టుకు రావాల్సిందే l Exemption From Personal Appearance for YS Jagan

Jagan must personally attend cbi court

Nampally CBI Court, YSR Congress Party, YS Jagan Mohan Reddy, Illegal Assets Case, Personal Exemption Petition

CBI Court Reject YS JAagana Mohan Reddy Exemption From Personal Appearance Petition in Illegal Assets Case.

అక్రమాస్తుల కేసులో జగన్ కు ఝలక్

Posted: 09/01/2017 06:49 AM IST
Jagan must personally attend cbi court

అక్రమాస్తుల కేసులో వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగనోహ్మన్ రెడ్డికి మళ్లీ చుక్కెదురైంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను గురువారం సీబీఐ కోర్టు తోసిపుచ్చింది.

సుదీర్ఘంగా విచారణకు హాజరవుతున్న వైఎస్ జగన్ వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ వైఎస్ జ‌గ‌న్ త‌న న్యాయ‌వాది ద్వారా ఇటీవ‌ల‌ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్‌కు మినహాయింపు ఇవ్వొద్దని కోర్టులో సీబీఐ తన వాదనలు వినిపించింది. ఇందుకు ఏకీభవించిన న్యాయస్థానం మినహాయింపు కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.

ఏదైనా ప్ర‌త్యేక సంద‌ర్భం ఉంటే సీబీఐ కోర్టులోనే ఇటువంటి పిటిష‌న్‌లు వేసుకోవాల‌ని సూచించింది. మొత్తం 11 కేసుల్లో ప్రతి శుక్రవారం జగన్‌ సీబీఐ కోర్టులో హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మినహాయింపు కావాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBI Court  Illegal Assets Case  YS Jagan  

Other Articles