Arun Jaitley hints crackdown against bad loans బ్యాంకుల్లో వున్నదంతా తెల్లధనం కాదు: అరుణ్ జైట్లీ

Fall out of demonitization on predicted lines says arun jaitley

arun jaitley, banks, mamata banerjee, chidambaram, demonetisation, Note ban, big scam, Narendra Modi, West Bengal, demonetization, Rs 500, Rs 1000, Reserve bank of India, yearly report, PM Modi, south asian terrorism, urjit patel, jaitley, arun jaitley on bad loans, bad loans, bad loans in india, arun jaitley rbi, arun jaitley rbi report, arun jaitley on rbi report, rbi annual report, rbi annual report 2017

Finance Minister Arun Jaitley hinted at a crackdown against bad loans in India. He said that finding a solution to this crisis will take time but at the same time he issued a warning to the private sector

బ్యాంకుల్లో వున్నదంతా తెల్లధనం కాదు: అరుణ్ జైట్లీ

Posted: 08/31/2017 04:11 PM IST
Fall out of demonitization on predicted lines says arun jaitley

నోట్ల రద్దు, ఆ తరువాత బడ్జట్ లో భాగంగా అమల్లోకి తీసుకువచ్చిన నూతన అర్థిక బిల్లులతో ప్రజల తమ జేబుల్లోని డబ్బును కూడా బ్యాంకుల్లో వేస్తున్నారు. పనిలో పనిగా నల్లకుబేరులు కూడా తమ వద్దనున్న డబ్బును బ్యాంకుల్లో వేసేసి దానిని కూడా తెల్లగా మార్చుకున్నారా..? అంటే కాదనే అంటున్నారు కేంద్ర అర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ. బ్యాంకుల్లో వున్నదంతా తెల్లధనం కాదని అంటున్నారు. అదేంటి బ్యాంకుల్లో వున్నా అది నల్లధనం ఎలా అవుతుందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయా..?

భారతీయ రిజర్వు బ్యాంకు గత అర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను వెలువరించిన నేపథ్యంలో కేంద్రం 16 వేల కోట్ల రూపాయల నల్లధనం రాబట్టడానికి 21 వేల కోట్ల రూపాలయను వెచ్చింది నోట్ల రద్దు చేయడంతో పాటు కొత్తగా నోట్లను ముద్రించిందన్న విమర్శలు విపక్ష్ సబ్యుల నుంచి వ్యక్తం కాగా, రంగంలోకి దిగిన కేంద్రమంత్రి డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగారు. అందులో బాంగా ఆయన బ్యాంకుల్లో వున్నదంతా తెల్లడబ్బు అని భావించలేమని చెప్పారు.

బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బు అంతా తెల్లదనం అయిపోదంటున్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. రద్దు నిర్ణయం తర్వాత పెద్ద నోట్లు ఊహించినట్లుగానే బ్యాంకులకు వచ్చాయని.. దీని ఫలితం దీర్ఘకాలంలో బాగుంటుందని స్పష్టం చేశారు. బ్యాంకుకి వచ్చిన ప్రతి నోటు వివరాలు ఉన్నాయని.. ఎవరెవరి అకౌంట్ ద్వారా ఎంతెంత డబ్బు మార్పిడి జరిగిందనే వివరాలు ఉన్నాయన్నారు. మొత్తం నగదు బ్యాంకులోకి రావటం వల్ల భవిష్యత్ లో ఎవరూ పన్నుల నుంచి తప్పించుకోలేరన్నారు.

బ్యాంకులో డిపాజిట్ అయినంత మాత్రాన బ్లాక్ మనీ.. వైట్ కాదన్నారు. అంతా తెల్లదనం అయిపోలేదన్నారు. ప్రతి నోటు చట్టబద్దమేనని అర్థం కాదని ఆయన స్పష్టం చేశారు.  పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనం పూర్తిగా మారిపోయింది.. నిర్మూలన అయిపోయింది అని చెప్పటం లేదన్నారు. ప్రతి నోటు ఆర్థిక వ్యవస్థలోకి.. బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావటం మంచిదే అన్నారు.

నోట్ల రద్దు తర్వాత పన్ను పరిధిలోకి వచ్చిన వారి సంఖ్యలో కోట్లలో పెరిగిందన్నారు. ఇది ప్రభుత్వ ప్రత్యక్ష పన్ను ఆదాయాన్ని భారీగా పెంచాయన్నారు. ఎవరూ పన్ను పరిధి నుంచి తప్పించుకోలేరని సంకేతాలు పంపినట్లు చెప్పారు. రద్దయిన పెద్ద నోట్లు అన్నీ తిరిగి రావటంపై ప్రభుత్వం ఆందోళన చెందటం లేదని.. ఇది మంచి పరిణామం అన్నారు అరుణ్ జైట్లీ. నోట్ల రద్దు వల్ల ప్రభుత్వానికి ఏమీ మిగల్లేదు అంటూ వస్తున్న విమర్శలపై ఈ విధంగా అరుణ్ జైట్లీ స్పందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  arun jaitley  banks  note ban  PM Modi  urjit patel  tmc note ban  RBI  

Other Articles