Ten killed in Mumbai building collapseఆ అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య

10 dead at least 20 feared trapped as mumbai building collapses

building collapse in mumbai, mumbai building collapse, pakmodia street, bhindi bazaar mumbai, mumbai news, latest mumbai news, mumbai rains

A five-storey building has collapsed in Dongri early today trapping many inside. At least 10 bodies have been recovered from the rubble. Over 20 injured have been taken to hospital.

ITEMVIDEOS:ముంబై భవనం కూలిన ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

Posted: 08/31/2017 12:25 PM IST
10 dead at least 20 feared trapped as mumbai building collapses

గత వారం రోజుల నుండి ఏకధాటిగా కురిసిన వర్షాల నుంచి కొంత ఊరట పోంది.. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులకు చేరకుంటున్న ముంబై నగర ప్రజల విషదం వెంటాడింది. నగరంలోని ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. జేజే నగర్ సమీపంలోని పక్ మెడియా వీధిలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన సంభవించగానే ఏడుగురు మృతి శిధిలాలు మీదపడి మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు.. సమయం గడుస్తున్న కోద్ది మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది.

తాజా వివరాల ప్రకారం మృతుల సంఖ్య 11కు చేరగా, శిథిలాల కింద సుమారు 30 నుంచి 35మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అటు ఘటనాస్థలంలోనూ ఇటు జేజే అస్పత్రి అవరణలోనూ బాదితు, మృతుల బంధువుల అర్థనాధాలు మిన్నంటాయి. ఈ ఘటనలో సుమారు 20 మంది గాయపడ్డారని, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు.



సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎష్ బృందం, అగ్నిమాపక సిబ్బందితో పాటు రెస్క్యూ టీమ్‌ కూడా అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. పలువురిని శిథిలాల నుంచి వెలికి తీసి, చికిత్స నిమిత్తం జేజే ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదని డీసీపీ మనోజ్‌ శర్మ తెలిపారు. మరోవైపు ముంబైలో మొత్తం 971 భవనాలు కూలిపోయేందుకు సిద్దంగా వున్నట్లు బృహన్ ముంబై పాలక సంస్థ అధికారులు గుర్తించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mumbai rains  building collapse  pakmodia street  bhindi bazaar  mumbai  

Other Articles