Note ban a big scam and flopshow: CM Mamata Banerjee అది పూర్తిగా ఫ్లాఫ్ షో.!.. బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.!!

Note ban a big scam and flopshow cm mamata banerjee

mamata banerjee, chidambaram, demonetisation, Note ban, big scam, Narendra Modi, West Bengal, demonetization, Rs 500, Rs 1000, Reserve bank of India, yearly report, PM Modi, south asian terrorism, urjit patel

I feel it was totally a flop show. 99% of the demonetized currency has come back to the RBI. Only one per cent has not returned. most vulnerable sections of society suffered massive pain.

అది పూర్తిగా ఫ్లాఫ్ షో.!.. బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.!!

Posted: 08/31/2017 11:37 AM IST
Note ban a big scam and flopshow cm mamata banerjee

భారతీయ రిజర్వు బ్యాంకు వెలువరించిన వార్షిక నివేదిక నేపథ్యంలో గత ఏడాది కాలంలో పెను సంచలన, సాహాసోపేత నిర్ణయంగా పేర్కోంటూ 104 మంది దేశ ప్రజల ప్రాణాలను బలిగొని.. కోట్లాది మంది ప్రజలను ఇబ్బందులకు గురిచేసి.. యావత్ దేశాన్ని రోడ్డపైకి ఈడ్చి.. బ్యాంకులు, ఏటీయం కేంద్రాల వద్ద రోజుల తరబడి నిల్చునేట్టు చేసి.. ప్రజల విలువైన సమయాన్ని వృధా చేస్తూ.. వారితో అటలాడుకుని.. ఇటు దేశ అర్థిక వృద్దిని కూడా కుంటుపర్చిన ఘోరతప్పిదం.. పెద్దనోట్లు రద్దు అని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు.

 పెద్దనోట్ల రద్దు వివరాలతో ఆర్బీఐ వార్షిక నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో అమె ఈ నిర్ణయంపై ప్రజల దృష్టిపడకుండా దేశచరిత్రలనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడిందని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నోట్లరద్దు అతిపెద్ద కుంభకోణమని, ఫ్లాప్‌షో అని అభివర్ణించారు. నోట్లరద్దు ప్రక్రియపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుపై దేశ ప్రజలకు విశ్వాసముందని పేర్కొన్నారు.

పెద్దనోట్ల రద్దుపై ఆర్బీఐ వెల్లడించిన వివరాలు పెద్ద కుంభకోణం జరిగిందనే సంకేతాలను ఇస్తున్నాయని.. ఇది పూర్తిగా ఫ్లాప్‌షో అని విరుచుకుపడ్డారు. 99శాతం రద్దైన నోట్లు ఆర్బీఐకి తిరిగొచ్చాయి. కేవలం ఒక్కశాతం మాత్రమే తిరిగి రాలేదని దేశంలో అరశాతానికి తక్కువ వున్న దొంగల కోసం నూరుశాతం ప్రజలను కేంద్రం దొంగలను చేసిందని అరోపించారు. ఈ మేరకు అమె తన అభిప్రాయాలను ఫేస్ బుక్ లని తన అకౌంట్ ద్వారా వెల్లడించారు.

నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్లలో రద్దు అనంతరం 99%  బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని ఆర్బీఐ పేర్కొంది. రూ. 15.44 లక్షల కోట్ల విలువైన రద్దయిన నోట్లలో రూ. 15.28 లక్షల కోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయ్యాయని తెలిపింది. అంటే, కేవలం రూ. 16, 050 కోట్లు మాత్రమే తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్‌ కాలేదని వెల్లడించింది. అలాగే, రద్దు నిర్ణయం అనంతరం రూ. 1000 నోట్లలో కేవలం 1.4% మాత్రమే తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోనికి రాలేదని, 98.6% నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  mamata banerjee  note ban  PM Modi  urjit patel  tmc note ban  RBI  

Other Articles