‘Lifetime ban’ on convicted lawmakers ఆ ఎంపీలు, ఎమ్మెల్యేల భవిష్యత్తుపై నేటి నుంచే విచారణ

Sc to hear lifetime ban petition on convicted lawmakers

Supreme Court, Convicted Leaders, Lifetime Ban, apex court, indian court, hearing, ban on lawmakers, Ashwini Upadhyay, BJP, Politics

The Supreme Court will hear the PIL filed by BJP leader Ashwani Upadhyay, seeking a lifetime ban on convicted and chargesheeted MPs and MLAs.

ఆ ఎంపీలు, ఎమ్మెల్యేల భవిష్యత్తుపై నేటి నుంచే విచారణ

Posted: 08/31/2017 10:46 AM IST
Sc to hear lifetime ban petition on convicted lawmakers

చట్టాలు చేసే వాళ్లం.. మాకు చట్టాలన్నీ చుట్టాలే.. సాధారణ ప్రజానికం వేరు మేము వేరు అంటూ అనేక చిత్రాలో చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిదులు వెలువరించే డైలాగులకు ఇక బ్రేక్ పడనుంది. గత యూపిఏ ప్రభుత్వ హాయంలో దోషులుగా తేలి శిక్ష అనుభవించిన నేతలు మళ్లీ రాజకీయాల్లో వచ్చేలా రూపోందించిన బిల్లును ఆ పార్టీ యువనేత రాహుల్ గాందీ విమర్శించడంతో రమారమి చట్టబద్దత సాధించిన అంశాన్ని అటెక్కకించేసింది మన్మోహన్ సింగ్ సర్కార్.

అయితే అసలు నేర చరిత్ర కలిగిన ప్రజా ప్రతినిధులను రాజకీయాల్లోని శాశ్వతంగా రానీయకుండా.. వారిపై జీవితకాలం వేటు వేయాలన్నది ఓ కాషాయ నేత అలోచన. దీంతో ఇక రాజకీయాల్లోకి రావాలని చట్టసభలకు ఎన్నిక కావాలి అంటే కండస్టు సర్టిఫికేట్ మాదిరిగా నేర చరిత్ర వుండకూడదన్న కొత్త నిబంధన వుండాలన్నది అతని అభిమతం. స్వతంత్ర్య భారతావనిలో గత 70 ఏళ్లుగా నేరచరిత్ర కూడా అదనపు అర్హతగా భావించి రాజకీయ అరంగ్రేటం చేస్తున్నావారికి చెక్ పెట్టలాని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నేటి నుంచి వాదనలు జరగనున్నాయి. ఆ నేత పేరే.. అశ్వని ఉపాధ్యాయ
 
ఏదైనా నేరంలో ఛార్జీషీట్‌ నమోదై జైలుకు వెళ్లి వచ్చిన చట్టసభల ప్రతినిధులు (ఎమ్మెల్యే, ఎంపీ తదితరులు)పై వున్న ఆరేళ్ల నిషేధం స్థానంలో వారిపై జీవిత కాలం వేటు వేయాలని.. రాజకీయాలకు వారిని అనర్హులుగా చేయాలని అశ్వినీ ఉపాధ్యయ పిటీషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ పిటిషన్‌ పై విచారణ జరగనుంది. కాగా, ఇదే పిటిషన్ గత వాదనల సందర్భంగా శిక్ష అనుభవించిన నేతల విషయంలో స్పష్టమైన విధానాలు లేకుండా అవలంభిస్తున్నారంటూ ఎన్నికల కమిషన్ పై సుప్రీం సీరియస్ అయ్యింది.
 
అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత, వయో పరిమితి విధించాలంటూ కేంద్ర ఎన్నికల కమీషన్ తోపాటు కేంద్రానికి కూడా అత్యున్నత న్యాయస్థానం సిఫార్సు చేసింది. నేర చరిత్ర ఉన్న నేతలు రాజకీయాల్లో కొనసాగటం సబబు కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూనే.. వారిపై జీవిత కాల నిషేధానికి మాత్రం ఎన్నికల సంఘం వెనకంజ వేయటం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం కూడా ఆర్టికల్‌ 14 ప్రకారం నేరచరిత నేతలపై  బ్యాన్ సబబు కాదని ఇప్పటికే సుప్రీంకోర్టుకు ఓ నివేదికను సమర్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Convicted Leaders  Lifetime Ban  Ashwini Upadhyay  BJP  Politics  

Other Articles