The great DeMo deception అర్బీఐ నోట్ల రద్దు నివేదిక.. తెలివైన పెద్ద కుంభకోణం..

Shame on rbi for recommending demonetisation chidambaram

chidambaram, demonetisation, Note ban, big scam, Mamata Banerjee, Reserve bank of India, yearly report, PM Modi, south asian terrorism, urjit patel

The government has spent Rs21000 crore to recover Rs 16000 crore. The utterly failed demonetisation is nothing but a disaster in which 104 innocent people were killed while the corrupt made windfall gains," congress questioned

అర్బీఐ నోట్ల రద్దు నివేదిక.. తెలివైన పెద్ద కుంభకోణం..

Posted: 08/31/2017 09:19 AM IST
Shame on rbi for recommending demonetisation chidambaram

నోట్ల రద్దు పెద్ద కుట్రపూరిత కుంభకోణం.. మోడీ సర్కార్ ప్రజలకు కనిపించని అవినీతికి పాల్పడుతుంది.. ప్రజలను కష్టాల్లోకి నెట్టి.. నల్లధనాన్ని ప్యూర్ కరెన్సీగా మార్చేస్తుంది. అని గత ఏడాది నవంబర్ 8 నుంచి విపక్ష పార్టీలు కంఠశోశ కలిగేలా అరిచినా.. పట్టించుకోని ప్రజలు.. ముందుగా మన వద్దనున్న నోట్లను ఎలా మార్చుకోవాలా..? అన్న అందోళనలకు గురై.. మంచా.. చెడా అన్న విషయాన్ని పక్కనబెట్టారు. ఇక తీరా అర్బీఐ వార్షిక నివేదిక రాగానే.. మళ్లీ అదే అంశాన్ని తీవ్రంగా చర్చిస్తూ.. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

అసలీ నివేదికలో ఏం వుందంటే.. గత ఏడాది నవంబర్ 8న రద్దు చేసిన పాత పెద్ద నోట్లలో 99 శాతం నోట్లు అర్బీఐకి చేరకున్నాయని, కాగా, కేవలం 1శాతం మాత్రమే వెనక్కు తిరిగి రాలేదని ఆర్బీఐ  ప్రకటన చేసింది. దీనిపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. దేశంలోని సంపన్నుల వద్దనున్న నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు.. యావత్ దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేసి మరీ..  కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ నోట్లరద్దు నిర్ణయం తీసుకుందా అని ప్రశ్నించారు.

నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకోవాలన్న అర్భీఐ ప్రముఖులకు, ఈ సూచనలు ఇచ్చిన అర్థికవేత్తలు సిగ్గుతో తలదించుకోవాలని అక్షేపించారు, ‘ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆర్థికవేత్తలకు నోబెల్‌ బహుమతి ఇవ్వాలి’ అని ఎద్దేవాచేశారు. నోట్ల రద్దుతో ప్రభుత్వానికి వచ్చిన సొమ్ము 16 వేల కోట్లయితే.. కొత్త నోట్ల ముద్రణతో ఆర్బీఐ రూ.21 వేల కోట్లు వెచ్చించిందని.. నోట్ట రద్దుతో దేశ ప్రజలపై రూ.5వేల కోట్లు భారం అదనంగా పడిందని తెలిపారు. ఇందుకు కేంద్ర బ్యాంకు సిగ్గుపడాలన్నారు.

నోట్ల రద్దు పెద్ద విపత్తు అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జెవాలా ట్వీట్‌ చేశారు. సుమారు 104 మందిని దేశ ప్రజలను ప్రాణాలను బలిగోని కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దుతో సాధించిందేమిటీ అని ఆయన ప్రశ్నించారు. వివాహ సమయాల్లో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంతో అనేక మంది వివాహాలు కూడా నిలిచిపోయాయని, ప్రజలను అనేక కష్టనష్టాలకు గురిచేసి నోట్ల రద్దుతో కేంద్రం రూపాయి కూడా సంపాదించలేదని ఆయన మండిపడ్డారు.

విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు రప్పించి దేశ ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల రూపాయలు వేస్తామన్న ఎన్నికల హామీని ప్రజలు మర్చిపోయేందుకే కేంద్రం ఈ చర్యలు చేపట్టిందని దుయ్యబట్టారు. దేశంలోని పేదల అకౌంట్లలో సంపన్నులు డబ్బును నిల్వచేస్తున్నారని, ఇన్నాళ్లు దోచుకున్న వారు ఇక పేదల ఇళ్లకు వెతుకుంటూ వెళ్లి డబ్బులు జమచేస్తున్నారని ప్రధాని నోట్ల రద్దు సందర్బంగా చేసిన వ్యాఖ్యల్లో ఎంత నిజముందో అర్బీఐ నివేదిక స్పష్టం చేస్తుందని దుయ్యబట్టారు.
 
నోట్ల రద్దు సంస్థాగతంగా ఆర్బీఐకి ఉన్న ప్రతిష్ఠను దెబ్బతీసిందని, ప్రపంచంలో భారత్‌ విశ్వసనీయత దెబ్బతిందని, ఇందుకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నోట్ల రద్దు జాతి వ్యతిరేక చర్యని, ఇందుకు దేశం మోదీ ప్రభుత్వాన్ని క్షమించదని రణదీప్‌ సూర్జెవాలా అన్నారు. ఇక ఇదే అంశంపై స్పందించిన సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భారత చరిత్రలోనే కనిపించని అత్యంత భారీ కుంభకోణానికి పాల్పడిందని అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chidambaram  demonetisation  Note ban  PM Modi  south asian terrorism  urjit patel  

Other Articles