CM Manohar Parrikar wins Panaji bypoll గోవా ముఖ్యమంత్రి పారికర్ విజయకేతనం

Cm manohar parrikar wins panaji bypoll

goa bypoll results live updates, goa, goa news, narendra modi, goa bypoll results, manohar parrikar, parrikar, panaji poll, panaji results, goa bypoll, congress, cm manohar parrikar, girish chodanka, bjp, valpoi, roy naik, panaji, by-election in valpoi, goa bypoll update, goa, bypoll results, manohar parrikar, girish chodanka, bjp, congress

Goa CM Manohar Parrikar wins Panaji by-poll with a margin of over 4500 votes in opposition with Congress’ Girish Raya Chodankar.

గోవా ముఖ్యమంత్రి పారికర్ విజయకేతనం

Posted: 08/28/2017 10:06 AM IST
Cm manohar parrikar wins panaji bypoll

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ జయకేతనం ఎగురవేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలను వదిలి.. మిత్రపక్షాల డిమాండ్ మేరకు గొవా ముఖ్యమంత్రిగా బాద్యతలను చేపట్టిన ఆయన ఈ నెల 23న జరిగిన ఉప ఎన్నికలలో గోవా రాజధాని పానాజీ నుంచి బరిలోకి దిగారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి గిరీష్ రాయ చౌదన్కర్ పోటీకి నిలువగా, చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఉపఎన్నికల పోరులో అనూహ్యంగా మనోహర్ పారికర్ విజయాన్ని అందుకున్నారు.

ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చినపప్పటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గిరీష్ ముమ్మర ప్రచారం చేయగా, ఒక దశలో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కూడా తన ప్రత్యర్థి గిరీష్ కు లభిస్తున్న మద్దతుకు ఖంగుతిని.. తాను ఇక్కడ గెలవకపోతే.. మళ్లీ కేంద్రానికి వెళ్లిపోతా.. రక్షణశాఖ బాధ్యతలు తీసుకుంటానని వ్యాఖ్యనించి తీవ్ర విమర్శలను ఎదుర్కోన్నారు. పారికర్ వ్యాఖ్యలపై మరీ ముఖ్యంగా మిత్రపక్షం శివసేన తీవ్రస్థాయిలో విమర్శించి.. రక్షణ శాఖ అంటే అంత చులకనగా వుందా..? అని నిలదీసింది కూడా.

కాగా ఇవాళ జరిగిన కౌంటింగ్ తరువాత మనోహర్ పారికర్ విజయాన్ని అందుకున్నారు. తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గిరీష్ రాయ చందన్కర్ పై 4803 ఓట్ల తేడాతో ఈ విజయాన్ని అందుకున్నారు. కాగా తొలి రౌండ్ నుంచి ఆయన తన ప్రత్యర్థిపై అధిపత్యాన్ని కొనసాగించారు. అయితే విజయాన్ని అందుకున్న తరువాత పారికర్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే వారం తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : goa  bypoll results  manohar parrikar  girish chodanka  bjp  congress  

Other Articles