TDP leads over 20,000 votes in Nandyal By-election పదో రౌండ్‌ ఓట్ల లెక్కింపులో 20 వేలకు చేరిన టీడీపీ అధిక్యం

Tdp leads over 20 000 votes in nandyal by election

Nandyal Assembly bypoll, Andhra Pradesh, Chandrababu Naidu, YS Jagan, bramhananda reddy, bhuma nagireddy, shipa mohan reddy, Politics

Ruling TDP party gets landslide majarity in nandyal by-elections, it crosses majority of over 20 thousand after completion of 11 rounds

నంద్యాలలో 22 వేల ఓట్ల అధిక్యంలో టీడీపీ

Posted: 08/28/2017 12:22 PM IST
Tdp leads over 20 000 votes in nandyal by election

నంద్యాల ఉప ఎన్నకలో టీడీపీ అందరి అంచనాలను తారుమారు చేసి.. విజయపథంలో దూసుకుపోతుంది. రౌండ్ రౌండ్ కు తన అధిక్యతను పెంచుకుంటూపోతూ.. మొత్తం 19 రౌండ్లు వుండగా, 11 రౌండ్లకు చేరకునేలోపు ప్రత్యర్థి ప్రతిపక్ష అభ్యర్థికన్నా 20 వేల ఓట్ల మెజారిటీని సాధించి.. నంద్యాలలోనే కాదు రాష్ట్రంలోనూ తమ పట్టు ఏమాత్రం సడలలేదని సంకేతాలను రాష్ట్ర ప్రజలకు పంపింది. రాష్ట్రంలో తాము చేస్తున్న అభివృద్దిని చూసి ప్రజలు తమ పక్షాన నిలిచారని చాటిచెబుతుంది.

ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి  16 వేలుగా నమోదైన మోజారిటీ.. అక్కడి నుంచి కొంత నమ్మెదించింది. ఆరవ రౌండులో టీడీపీకి 6161 ఓట్లు పోలవ్వగా, వైసీపీకి 2858 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఈ రౌండ్ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 36,880 ఓట్లతో ముందుకు దూసుకెళ్లగా, వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 20,512 కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం అబ్దుల్‌ ఖాదర్‌ కు 330 ఓట్లుతో వున్నారు. ఇక ఏడో రౌండులోనూ టీడీపీకి 512 ఓట్లు అధిక్యం లభించగా, ఎనమిదవ రౌండులో పూర్తయ్యేసరికి 17263 ఓట్ల మెజారీటీని బ్రహ్మనందరెడ్డి అందుకున్నారు. ఇక 11వ రౌండ్ పూర్తయ్యేసరికి 20,261 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

అయితే ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి పదకొండవ రౌండ్ ఎన్నికల ఫలితం రాగానే కౌంటింగ్ కేంద్రాన్ని వదిలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అభివృద్దితో గెలిచిందని చెప్పుకుంటున్న వ్యాఖ్యలను ఖండించారు. టీడీపీకి కేవలం డబ్బుతో గెలిచిందని అరోపించారు. ప్రజల తీర్పును గౌరవిస్తానని చెప్పిన ఆయన ఫలితాల సరళి చూస్తే ప్రజలు సానుభూతికే ఓటు వేశారని అవగతమవుతుందన్నారు. అయితే మైనారిటీ వర్గాలు కూడా టీడీపీకే ఓటు వేయడంతో ఆయన ఒకింత అశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కాగా, రాజకీయ సన్యాసం గురించ తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై తాను తరువాత మాట్లాడుతానని చెప్పారు.

రౌండ్ల వారీగా ఫలితాలు:

తొలి రౌండ్‌:  టీడీపీ తొలిరౌండ్‌లో 1,198 ఓట్ల ఆధిక్యంలో ఉంది.  టీడీపీకి 5,477, వైఎస్‌ఆర్‌ సీపీకి 4,279, కాంగ్రెస్‌ కు 69 ఓట్లు వచ్చాయి.

రెండో రౌండ్‌: టీడీపీ 1,762 ఓట్లతో లీడ్ లో ఉంది. టీడీపీకి 5,162, వైఎస్‌ఆర్‌ సీపీకి 3400 ఓట్లు. రెండు రౌండ్ల అనంతరం టీడీపీ 2,960 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

మూడు రౌండ్: టీడీపీకి 6,640, వైఎస్‌ఆర్‌ సీపీకి 3,553. టీడీపీ 6,047 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

నాలుగో రౌండ్: టీడీపీకి 6,465, వైఎస్‌ఆర్‌ సీపీకి  2,859 ఓట్. 3597 ఓట్ల అధిక్యంలో టీడీపీ. మొత్తంగా వైసీసీపై 9670 ఓట్ల అధిక్యంలో టీడీపీ

ఐదో రౌండ్‌: టీడీపీ 6955, వైసీపీ 3463 ఓట్లు.  టీడీపీకి 3492 ఓట్ల అధిక్యం మొత్తంగా 13 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్న టీడీపీ

ఆరో రౌండ్‌:  టీడీపీదే అదిక్యం టీడీపీకి 6,161,  వైఎస్‌ఆర్‌ సీపీకి 2,858.  టీడీపీ 3303 ఓట్ల అధిక్యం.

ఏడో రౌండ్‌: టీడీపీకి 4,859, వైఎస్‌ఆర్‌ సీపీకి 4,312 ఓట్లు పోల్‌ అయ్యాయి. టీడీపీకి 512 ఓట్లు అధిక్యం.

ఎనమిదవ రౌండ్: టీడీపీకి 4436 ఓట్లు పోలవ్వగా, వైసీపికి 4088 ఓట్లు మాత్రమే దక్కాయి

తొమ్మిదవ  రౌండ్: టీడీపీకి 4309 ఓట్లు పోలవ్వగా, వైసీపికి 3430 ఓట్లు లభించాయి

పదవ రౌండ్: టీడీపికి 4682 ఓట్లు పోలవ్వగా, వైసీపికి 3196 ఓట్లు పోలయ్యాయి

పదకొండవ రౌండ్: టీడీపీకి 4326 ఓట్లు పోలవ్వగా, వైసీపికి 3722 ఓట్లు మాత్రమే దక్కాయి

పన్నెండవ రౌండ్: టీడీపీకి 5629 ఓట్లు పోలవ్వగా, వైసీపికి 4099 ఓట్లు లభించాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandyal Assembly bypoll  Andhra Pradesh  Chandrababu Naidu  YS Jagan  Politics  

Other Articles