Nandyal By-election Result updates నంద్యాల ఉప ఎన్నికల అప్ డేట్స్.. తొలి రౌండ్ లో టీడీపీ పైచేయి

Nandyal by election result updates

Nandyal Assembly bypoll, Andhra Pradesh, Chandrababu Naidu, YS Jagan, bramhananda reddy, bhuma nagireddy, shipa mohan reddy, Politics

Counting of votes for the high-stakes by-elections in nandyal assembly seat has begun. After the results of first Round tdp leads over opposition candidate

నంద్యాల ఉప ఎన్నిక అప్ డేట్స్.. టీడీపీ పైచేయి

Posted: 08/28/2017 09:11 AM IST
Nandyal by election result updates

కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేయగా, ఇవాళ ఫలితాలు వెలువడతున్నాయి. ఈ ఎన్నికలలో తొలి రౌండ్ ఫలితాలు వెలువడగానే టీడీపీ ప్రతిఫక్ష వైసీపీ పార్టీపై పై చేయి సాధించింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లుతో కౌంటింగ్ ప్రారంభించగా,  వాటిలో ఏ ఒక్క ఓటుకు కూడా చెల్లలేదు. మొత్తంగా నంద్యాల ఉపఎన్నికల్లో మొత్తం 250 పోస్టల్‌ బ్యాలెట్లు పంపగా... 211 మంది ఏ అభ్యర్థికి ఓటు వేయలేదు. మరో 39 పోస్టల్‌ బ్యాలెట్లు సరైన చిరునామా లేకపోవడంతో వెనక్కి వచ్చాయి.

ఇక ఆ తరువాత ఎన్నికలకు కౌంటింగ్ ను అధికారులు ప్రారంభించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 14 టేబుళ్లపై 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రౌండ్ల వారీగా మెజార్టీని తెలిపేందుకు కౌంటింగ్‌ కేంద్రం ఎదుటనే పెద్ద ఎల్‌ఈడీ తెరను ఏర్పాటుచేశారు. మొదట నంద్యాల గ్రామీణంతో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఉదయం 10.30-11.00 గంటల మధ్య పూర్తి ఫలితం వెల్లడవుతుందని అధికారులు చెబుతున్నారు.

తొలిరౌండ్‌ లెక్కింపు పూర్తయిన తరువాత అధికార టీడీపీ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. ఈ రౌండ్‌లో తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 5,477 ఓట్లు రాగా.. వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 4,279 ఓట్లు, కాంగ్రెస్‌కు 69 ఓట్లు, నోటాకు 80 ఓట్లు వచ్చాయి. మొత్తంగా తొలి రౌండ్‌లో తెదేపాకు 1198 మెజార్టీ లభించింది. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం.

రౌండ్ల వారీగా ఫలితాలు:

తొలి రౌండ్‌:  టీడీపీ తొలిరౌండ్‌లో 1,198 ఓట్ల ఆధిక్యంలో ఉంది.  టీడీపీకి 5,477, వైఎస్‌ఆర్‌ సీపీకి 4,279, కాంగ్రెస్‌ కు 69 ఓట్లు వచ్చాయి.

రెండో రౌండ్‌: టీడీపీ 1,762 ఓట్లతో లీడ్ లో ఉంది. టీడీపీకి 5,162, వైఎస్‌ఆర్‌ సీపీకి 3400 ఓట్లు. రెండు రౌండ్ల అనంతరం టీడీపీ 2,960 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

మూడు రౌండ్: టీడీపీకి 6,640, వైఎస్‌ఆర్‌ సీపీకి 3,553. టీడీపీ 6,047 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 

నాలుగో రౌండ్: టీడీపీకి 6,465, వైఎస్‌ఆర్‌ సీపీకి  2,859 ఓట్. 3597 ఓట్ల అధిక్యంలో టీడీపీ. మొత్తంగా వైసీసీపై 9670 ఓట్ల అధిక్యంలో టీడీపీ

ఐదో రౌండ్‌: టీడీపీ 6955, వైసీపీ 3463 ఓట్లు.  టీడీపీకి 3492 ఓట్ల అధిక్యం మొత్తంగా 13 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్న టీడీపీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandyal Assembly bypoll  Andhra Pradesh  Chandrababu Naidu  YS Jagan  Politics  

Other Articles