విదేశాల్లోని మీ బంధువుల ఇంటికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా..? సరే అయితే పాస్ పోర్టు వుందా..? లేదా..? తత్కాల్ తరహాలో వేగవంతంగా పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారా..? అయినా ఎస్బీ (స్పెషల్ బ్రాంచి) పోలీసుల తనిఖీ కాకపోవడంతో అలస్యం జరుగుతుందా..? మరికోన్ని రోజులు ఇలాగే వుంటుంది. రమారమి మరో ఏడాది తరువాత ఏ తనిఖీలు లేకుండానే మీకు పాస్ పోర్టు జారీ అవుతుంది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది ముమ్మాటికీ నిజం.
పాస్ పోర్టు జారీ ప్రక్రియలో ఇక పోలీసుల తనిఖీలు ఉండవు. అయితే ఇందుకోసం మరో ఏడాది పాటు అగాల్సివుంటుంది. పాస్ పోర్టు కోసం దరఖాస్తుదారుడి ఇంటికి వచ్చి ఆరా తీసే పోలీసులు ఇకపై అలా చేయాల్సిన అవసరం లేకుండా కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటుంది. దరఖాస్తుదారుడి పూర్వపరాల పరిశీలన త్వరలోనే మౌస్ పై ఒక్క క్లిక్‌తో పూర్తయిపోతుంది. నేరాలు, నేరగాళ్ల ట్రాకింగ్ నెట్‌వర్క్, సిస్టమ్స్ ప్రాజెక్టుకు పాస్ పోర్టు సేవలను అనుసంధానం చేయడం ద్వారా.. దరఖాస్తుదారులకు నేర చరిత్ర ఉన్నదీ లేనిదీ వెంటనే తెలిసిపోతుంది. అయితే ఈ విధానం పూర్తిగా అమల్లోకి రావడానికి మరో ఏడాది కాలం పట్టే అవకాశం వుంది.
అంతేకాదు.. ఇకపై దేశంలో ఏ మారుమూల ఏ నేరం జరిగినా.. నేరగాళ్లు ఎక్కడికీ తప్పించుకోలేరు. నేరాలు, నేరగాళ్ల ట్రాకింగ్ నెట్‌వర్క్, సిస్టమ్స్ ప్రాజెక్టు (సీసీటీఎన్‌ఎస్) కింద దేశంలోని అన్ని రాష్ట్రాల నేర రికార్డులను కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ లో పొందుపర్చింది. ఇందుకోసం ఇప్పటికే కేంద్రం దేశంలోని 15,398 పోలీసు స్టేషన్లకు గాను 13,775 స్టేషన్ల వివరాలను ‘డిజిటల్ పోలీసు పోర్టల్ లో అప్ లోడ్ చేసింది. ఈ పోర్టల్ ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోర్టల్లోని వివరాలు దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులతో పాటు, కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు.
2018 మార్చిలోపు అన్ని పోలీసు స్టేషన్ల రికార్డులను ఆన్ లైన్ లో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు నేరగాళ్లను పట్టుకోవడంలో రాష్ట్రాల మధ్య కొరవడిన సమన్వయం ఈ పోర్టల్ తో సమసిపోతుందని, దేశంలో ఎక్కడ నేరం చేసిన వారైనా ఏ మారుమూల ఉన్నా సులభంగా పట్టుకోవచ్చన్నారు. కాగా ఈ ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం హోం మంత్రత్వ శాఖ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more