సీనియర్ రాజకీయ నేత భూమా నాగిరెడ్డి గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించడంతో.. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన ఉపఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని కేంద్రాలకు పోలింగ్ సామాగ్రి తరలించిన అధికారులు.. ఎన్నికల సిబ్బందికి తగు విషయాలలో మరోమారు తర్పీదును కూడా ఇచ్చారు. గతంలో లేనట్టుగా ఈ సారి ఎన్నికల కేంద్రంలో జరిగే ప్రతీ కదిలికను ఎన్నికల సంఘం అధికారులు కెమెరా లింక్ తో పరిశీలించనున్నారు.
నియోజకవర్గ పరిధిలోని మొత్తం 255 పోలింగ్ బూత్ లకు దాదాపు 6వేల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాలు పంచుకుంటున్నారు. బుధవారం ఉదయం 7 గంటలను నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్ లు సమస్యాత్మకమైనేనని నిర్థారించుకున్న ఎన్నికల సంఘం రమారమి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.
నియోజకవర్గంలోని 144 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్మాత్మకంగా, 71 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి వాటిలో ప్రశాంతంగా ఓటింగ్ జరిగేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పారామిలటరీ బలగాలకు అప్పగించనున్నారు. దీనికి తోడు పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలను కూడా అమర్చి ఎప్పటికప్పుడు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల పరిస్థితిని పర్యవేక్షించనుంది. ఇందుకోసం ఇప్పటికే 6 కంపెనీల కేంద్ర పోలీస్ బలగాలు నంద్యాలకు చేరుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ క్యాస్టింగ్ సిబ్బంది సహా మొత్తం 10 మంది విధులు నిర్వహించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more