Violence in Kashmir didn't curb post demenetisation కేంద్రమంత్రి వ్యాఖ్యలు.. వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నం..

Fact check jaitley s claim that demonetisation curbed violence in kashmir

Arun Jaitley, finance minister, demonetisation, stone pelters, maoist, seperatist, jammu and kashmir, fund starved, violence in JK, Bashir Lashkari, South Asia Terrorism, media reports

Data from the authoritative South Asia Terrorism Portal and recent media reports show a different picture from what the finance minister Arun Jaitley has tried to paint.

కేంద్రమంత్రి వ్యాఖ్యలు.. వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నం..

Posted: 08/22/2017 07:20 PM IST
Fact check jaitley s claim that demonetisation curbed violence in kashmir

పాత పెద్ద నోట్ల రద్దు తరువాత సీమాంతర ఉగ్రవాదంతో పాటు దేశంలోని అంతర్గత తీవ్రవాదం రెండు నిధులు లేక తమ ఉనికిని కూడా కొల్పయాయని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులకు పూర్తి భిన్నంగా వున్నాయా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. జమ్ము కశ్మీర్‌లో రాళ్ల దాడులు తగ్గుముఖం పట్టాయని...ఉగ్రవాదులు, తీవ్రవాదులకు నిధుల కొరత ఏర్పడిందని జైట్లీ చెప్పిన వ్యాఖలు సత్యదూరమని స్పష్టమవుతుంది.

దక్షిణాసియా టెర్రరిజానికి చెందిన ఓ అధికారిక  పోర్టల్‌లో పొందుపరిచిన వివరాలు, స్థానిక మీడియా కథనాలు విశ్లేషిస్తే పరిస్థితి భిన్నంగా ఉందిన్న విషయం తేలుస్తుంది. జమ్ము కశ్మీర్‌లో నోట్ల రద్దు నిర్ణయంతో సంబంధం లేకుండా రాళ్ల దాడులు యథావిథిగా కొనసాగుతున్నాయని మీడియా నివేధికల అధారాగంగా తేలిపోయిందని, దీని ద్వారా నోట్ల రద్దు ఉగ్రవాదంపై ప్రభావం చూపలేదన్న విషయం స్పష్టం అవుతుందని పోర్టల్ పేర్కోటుంది.. గత నెలలో కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బుద్గాం జిల్లాలో రాళ్లు విసురుతున్న అల్లరి మూకలను చెదరగొట్టేందుకు సైన్యం కాల్పులు జరిపింది.

అంతకుముందు జూన్‌ 26న ఈద్‌ సందర్భంగా బారాముల్లా జిల్లాలో ఆందోళనకారులు రాళ్లు విసరడంతో 12 మంది గాయపడ్డారు. అదేరోజు అనంత్‌నాగ్‌, సోపియన్‌, కుల్గాం, పుల్వామా జిల్లాలు సహా కశ్మీర్‌ అంతటా అల్లర్లు చెలరేగాయి. మే 28నుంచి జూన్‌ 26 మధ్య రంజాన్‌ సందర్భంగా అల్లర్లలో 43 మంది మరణించడం ఇదే అత్యధికమని నివేదికలు చెబుతున్నాయి. నోట్ల రద్దు జరిగిన తర్వాత కాలంలో గత ఏడాదితో పోలిస్తే హింసాత్మక ఘటనలు మరింత పెరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arun Jaitley  finance minister  demonetisation  stone pelters  maoist  seperatist  jammu and kashmir  

Other Articles