మొత్తుకుంటున్నా వినకుండా చిన్నారిపై కారు ఎక్కించేసింది | Headphones in Ears Woman Crushed Child in Delhi

Child hit to death by car in palam delhi

Delhi Video Footage, Woman Headphones kill Child, Palam Children Death Video, Woman Crush Child Car Video, Palam Child Death Incident, Deepak Mother Preeti, Vandana Kills Deepak, Woman Crush Child, Horrific Video

Woman kills a child while driving a car in Palam. The footage of the tragic incident in which a two-year-old boy Deepak was crushed to death by a 26-year-old woman in Southwest Delhi’s Palam area emerged on Wednesday.

ITEMVIDEOS:చెవిలో ఇయర్ ఫోన్.. ప్రాణం తీసింది

Posted: 08/08/2017 11:04 AM IST
Child hit to death by car in palam delhi

ఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారిని ఓ మహిళ తన కారుతో గుద్దిచంపిన వీడియో వైరల్ అవుతోంది. నైరుతి ఢిల్లీలోని పాలం ప్రాంతంలో ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.

దీపక్ అనే ఆ బాలుడి తల్లి చెప్పిన వివరాల ప్రకారం. సాధ్ నగర్ లో దీపక్ కుటుంబం నివసిస్తుంది. పిల్లాడికి భోజనం పెడుతుండగా ఆడుకుంటూ ఒక్కసారిగా అతగాడు రోడ్డుకు అడ్డంగా పరిగెత్తాడు. ఆ సమయంలో ఐ-20 కారులో ఓ 26 ఏళ్ల మహిళ దూసుకొచ్చింది. పిల్లాడి తల్లి ప్రీతి అరుస్తున్నా వినకుండా కారును ఎక్కించేసి ముందుకు వెళ్లింది. దీంతో కారు కింద పసికందు నలిగిపోయాడు.

 

ఆపై ఆ తల్లి అరుస్తూనే కారు వెంట పడి ఆపింది. ఆస్పత్రికి తరలించగా, అప్పటికే దీపక్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మెల్లిగా వెళ్లమంటూ మొత్తుకుంటున్నా.. లోపలున్న మహిళ చెవిలో ఇయర్స్ ఫోన్ పెట్టుకోవటంతో వినిపించుకోకపోవటంతో తన బిడ్డను చంపేసిందని ప్రీతి ఆరోపించింది. ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను అరెస్ట్ చేసి ఆపై బెయిల్ పై విడుదల చేశారు. కారు నడిపిన మహిళకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Palam Incident  Woman Crush Child  Horrific Video  

Other Articles

Today on Telugu Wishesh