నయీం ఖతమ్ కు ఏడాది.. ఆ పేర్లను తప్పింస్తున్నారా? | One Year Completed for Shadnagar encounter

Sit claims progress in nayeem encounter case

Gangster Nayeem, Nayeem Encounter, Shadnagar Encounter, Nayeem,. , SIT Nayeem Case Nayeem Case Progress, SIT Probe Nayeem Case, Nayeem Case Investigation, Nayeem Encounter one Year, Nayeem Encounter Case, Ex Maoist Gangster Nayeem, Nayeem Case, Nayeem Case Biggies Names, Nayeem Case Progress, Nayeem Case 1 Year

SIT claims progress in Nayeem encounter case. Ex Maoist and Gangster Encounter completes one year at Shadnagar.

సిట్ చిట్టా మాయం?.. అంతా అబద్ధం!

Posted: 08/08/2017 09:45 AM IST
Sit claims progress in nayeem encounter case

గ్యాంగ్ స్టర్ నయీమ్‌ ను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టి నేటికి ఏడాది పూర్తి అయింది. ఆగష్టు 8వ, తేదిన జరిగిన షాద్ నగర్ లోని మిలినీయం సిటీలో నయీమ్ చనిపోయిన తరువాత జరిపిన దాడుల్లో పెద్దఎత్తున బంగారంతో పాటు, ఆయనతో అంటకాగిన పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల వివరాలు, నగదు, భూ దందాలకు సంబంధించిన పత్రాలు తాము స్వాధీనం చేసుకున్నామన్న ప్రకటన తప్ప, ఇంతవరకూ కేసు కోర్టుకు ఎక్కింది లేదు. ఈ గ్యాంగ్ స్టర్ తో కలసి ప్రజలను ఇబ్బందుల పాలు చేసిన వారి అరెస్టులూ లేవు. ఈ కేసు విచారణ ఏడాదిగా సాగుతూనే ఉంది.

నయీంతో సంబంధాలు కలిగి ఉన్న ఓ పోలీసు అధికారి ఏకంగా 16 ఎకరాల స్థలాన్ని తీసుకొన్నట్టు సిట్ గుర్తించింది.2008 తర్వాత ఛత్తీస్ ఘడ్ కు చెందిన కొందరు ఐపీఎస్ అధికారులు
నయీంతో సంబంధాలను కలిగి ఉన్నారని సిట్ దర్యాప్తులో తేలింది. వాళ్లందరి పేర్లు తప్పించేందుకు గట్టి యత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా ఉన్న కేసు పురోగతి ఏంటన్న దానిపై అధికారులు ఓ ప్రకటన చేశారు. నయీమ్ ఎన్ కౌంటర్ తరువాత 31 కేసులను నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 9 కేసుల్లో చార్జిషీట్‌ దాఖలు చేశారు.

త్వరలోనే మిగతా 22 కేసుల్లో చార్జిషీట్‌ వేస్తామని ఈ కేసును ప్రత్యేకంగా విచారిస్తున్న ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలోని సిట్ అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఏడాదిగా నయీమ్ దందాలపై పలు ప్రాంతాల్లో 227 కేసులు నమోదయ్యాయని, మొత్తం 895 మంది సాక్షులను విచారించామని సిట్ ఓ ప్రకటనలో తెలిపింది.మరో వైపు చర్యలు తీసుకునే అంశంపై స్పందిస్తూ.. తమపై ఒత్తిళ్లు ఏం లేవని, నయీమ్ తో అంటకాగిన వారిలో 128 మందిని అరెస్ట్ చేసి, ఆపై 109 మందిని కస్టడీలోకి తీసుకుని విచారించామని సిట్ స్పష్టం చేసింది. దర్యాఫ్తు తుది దశకు చేరిందని చెబుతూ.. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ను కూడా విచారించామని, ఐదుగురు పోలీసు అధికారులు సస్పెండ్ కు గురయ్యారన్న విషయాన్ని ప్రస్తావించింది. ఇక కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోందని, దీన్ని త్వరలోనే పూర్తిచేస్తామని సిట్ తెలిపింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayeem Encounter  Telangana Police  SIT Probe  

Other Articles