చిన్నమ్మకు మరో షాక్.. ఏడుస్తోందిగా.. | Big Support Ropa's Allegations in Sasikala VIP Treatment

One more trouble for sasikala luxury prision

DIG Roopa, Roopa Allegations, Roopa Sasikala Jail Life, Sasikala VIP Treatment, Sasikala, DIG Roopa's Allegations, DIG Roopa Satyanarayana, Sasikala Prison ACB, Sasikala Troubles, Sasikala Jail Bribe

Advocate S Nataraj Sharma in Bengaluru urges ACB to probe jail irregularities, including Sasikala prison bribery case. Support DIG Roopa's Allegations.

రూపకు మాంచి సపోర్ట్ దొరికిందిగా...

Posted: 07/29/2017 10:11 AM IST
One more trouble for sasikala luxury prision

జైలు జీవితంలోనూ విలాసం అనుభవిద్దామని యత్నించి అడ్డంగా బుక్కయ్యింది చిన్నమ్మ శశికళ నటరాజన్. అక్రమాస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో సిబ్బందిని లంచంతో కొనేసి చిక్కుల్లో పడిపోయింది. ఇప్పుడు ఆ జైలు జీవితంపై విచారణ కోరుతూ బెంగళూరుకు చెందిన న్యాయవాది నటరాజశర్మ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప ఆరోపణలకు తాజాగా ఈయన చేసిన ఫిర్యాదు బలం చేకూరుస్తోంది.

డీజీపీ సత్యనారాయణరావు సహా పలువురు మొత్తం రూ.2 కోట్లు ముడుపులు అందుకుని శశికళకు జైలులో సకల సదుపాయాలు కల్పించారని రూప కర్ణాటక ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపై విచారణ జరుగుతోంది. అయితే రూప తనపై చేసిన ఆరోపణలు అవాస్తమని సత్యనారాయణ రావు కొట్టి పడేశాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన రూప రెండు రోజుల్లోగా
క్షమాపణలు చెప్పకుంటే రూ.50 కోట్లకు పరువునష్టం కేసు వేస్తానంటూ రూపకు నోటీసులు కూడా పంపారు.

అయినప్పటికీ తాను ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణలు చెప్పనని రూప తేల్చి చెప్పింది. ఈ ముడుపుల కేసుతో సంబంధం ఉన్న దినకరన్‌తోపాటు ఆస్ట్రేలియాకు చెందిన ప్రకాశ్ అనే వ్యక్తిని కూడా విచారించాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. దినకరన్ స్నేహితుడు మల్లికార్జున్ కోరిక మేరకే ప్రకాశ్ సహకరించినట్టు ఆధారాలు ఉన్నాయని శర్మ చెబుతున్నాడు. ఇక తన అన్న భార్య, టీటీవీ దినకరన్‌కు అత్తగారైన సంతానలక్ష్మి ఈనెల 26న మృతి చెందారు. అంత్యక్రియల్లో పాల్గొనేలా శశికళ పెట్టుకున్న పెరోల్‌ దరఖాస్తును సైతం అధికారులు నిరాకరించినట్లు సమాచారం. దీంతో మరింత కృంగిపోయిన శశికళ రెండురోజులు విలపిస్తుండగా జైల్లోనే ఉన్న సమీప బంధువు ఇళవరసి ఓదారుస్తున్నట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DIG Roopa  Sasikala  Prison Life  Bribe Case  

Other Articles