ఇందా.. ఈ వెయ్యి తీసుకో.. నా కూతురికి సీటు ఇవ్వు! | Frustrated Mother Open Bribe Offer to Chief Minister

Mother open letter to aravaind kejriwal

Aravind Kejriwal, Kejriwal Bribe Letter, Kejriwal 1000 Bribe, Chilla Khadar area Letter Aravind Kejriwal, Kejriwal Chilla Khadar Mother, Ram Jethmalani Kejriwal

Aravind Kejriwal, take Rs 1,000 but admit my kid in school' After their wards denied their children admission, 24 parents have approached the Delhi chief minister for help.

ముఖ్యమంత్రికి అఫీషియల్ లంచం

Posted: 07/29/2017 09:04 AM IST
Mother open letter to aravaind kejriwal

దెబ్బ మీద దెబ్బలతో కుదేలు అవుతున్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని బండ బూతులు తిట్టాలంటూ కేజ్రీవాల్ తనతో చెప్పేవాడని సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ సంచటన ప్రకటన చేశాడు. తనకు రావాల్సిన బకాయిల గురించి కేజ్రీవాల్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఓ తల్లి సీఎంకు రాసిన లేఖ మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది.

తన కుమార్తెను స్కూల్లో చేర్పించడానికి పలు ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె చివరికి ముఖ్యమంత్రికే లేఖ రాసింది. ‘కావాలంటే ఓ రూ.1000 ఇస్తా.. నా కుమార్తెకు మాత్రం స్కూల్లో సీటు ఇప్పించండి’ అని లేఖ రాసి తన ఆవేదనను వ్యక్తం చేసిందా తల్లి. తన కుమార్తెకు చదువు చెప్పమని కొన్ని నెలలుగా వేడుకుంటున్నానని, అయినా ఫలితం లేకుండా పోయిందని ఓ తల్లి లేఖలో పేర్కొంది. తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, తనకు చదువు చెప్పిస్తే తానైనా జీవితంలో ఎదుగుతుందని అందులో పేర్కొనడం పలువురితో కన్నీరు పెట్టించింది.

ఢిల్లీలోని చిల్లాఖదర్ వాసులు తమ తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ఇబ్బందులు పడుతుండడంతో ఆ మధ్య అందరూ కలిసి సీఎం కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్న పాఠశాలలు ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు లేవన్న కారణంతో తమ పిల్లల్ని స్కూళ్లలో చేర్చుకోవడం లేదని ఆరోపించారు. అయినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో ఇప్పుడు ఈ లేఖ హైలెట్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  CM Kejriwal  Chilla Khadar  Bribe Offer  

Other Articles