విషాధగాథ.. చిన్నారి ఛార్లీ కి విముక్తి | Beautiful Britain Little Boy Dies in front of Parents

Charlie gard passes away

Charlie Gard, Charlie Gard Death, Charlie Gard Parents, Charlie Gard Case, Charlie Gard Disease, Charlie Gard News, Charlie Gard Tribute, Charlie Gard Telugu Story, Charlie Gard Story, Charlie Gard Details, Charlie Gard, Beautiful Britain Little Boy, Rare Ill Boy Dies, Charlie Gard Disease

Charlie Gard Dies. Charlie parents announced his demise. Critically ill baby who became known around the world dies after being moved to hospice following long legal battle.

మా చిన్నారి చనిపోయాడు.. గర్వంగా ఉంది

Posted: 07/29/2017 11:17 AM IST
Charlie gard passes away

ఏ తల్లిదండ్రులకు ఎదురు కాకూడని నరకం అది. ప్రపంచమంతా ముక్తకంఠంతో జాలి చూపిన ఓ చిన్నారి జీవితం వాళ్ల కళ్ల ముందే అర్థాంతరంగా ముగిసింది. కన్నకొడుకు కళ్ల ముందే గిలగిలా కొట్టుకుని చనిపోతున్నా ఏం చేయలేని పరిస్థితి వాళ్లది. పోప్ ఫ్రాన్సిస్, డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్లంతా సానుభూతి చూపిన 11 నెలల బ్రిటన్ పసికందు ఛార్లీ గార్డ్ చనిపోయాడు. ఈ విషయాన్ని పిల్లాడి పేరెంట్స్ క్రిస్ గార్డ్, కొన్ని యేట్స్ తెలియజేశారు.

‘‘మా అందమైన చిన్నారి ఇక లేడు. ఛార్లీ నిన్ను చూసి మేం గర్వపడుతున్నాం’’ అంటూ ఓ ప్రకటన ఇచ్చారు. 11 ఏళ్ల ఆ చిన్నారికి అమర్చిన వెంటిలేటర్ ను తొలగించాలన్న ఓ బ్రిటీష్ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వైద్యులు తమ విధులను నిర్వర్తించారు. కాసేపటికే ఛార్లీ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. మెదడుకు సంబంధించిన మైటోకాండ్రియల్ డీఎన్ఏ డిప్లెషన్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో ఛార్లీ జన్మించాడు. శరీరం మొత్తం చచ్చుబడిపోవటమే కాదు, స్వయంగా శ్వాస కూడా తీసుకోలేడు. దీంతో బాబు బతకటం చాలా కష్టమని వైద్యులు నిర్థారించారు.

అయితే అమెరికాలో అత్యున్నత స్థాయి ట్రీట్ మెంట్ అందిస్తే బతికే అవకాశాలు ఉంటాయన్న ఆశతో ఆ దిశగా యత్నించారు. కానీ, అందుకు వైద్యులు సహా బ్రిటిష్ న్యాయస్థానం, మానవహక్కుల యూరోపియన్ కోర్టు అంగీకరించలేదు. చిన్నారికి సహాయం చేసేందుకు యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ముందుకు వచ్చాడు కూడా. దీంతో ఎలాగైనా తమ బిడ్డను కాపాడుకునేందుకు న్యాయ పోరాటం చేసి ఓడిపోయారు.

ఈ నేపథ్యంలోనే గురువారం హైకోర్టులో వాదనలు జరగ్గా, ఉద్వేగభరితంగా వెలువరించిన తీర్పులో ఆ బాలుడు ఇక చనిపోవటమే ఉత్తమం అని జడ్జి నికోలస్ ఫ్రాన్సిస్ వ్యాఖ్యానించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Britain  Charlie Gard  Death News  

Other Articles