Rs 5 crore graft charge rocks BJP Kerala unit బీజేపి నేతలను కలవరపెడుతున్న ‘నేతిబీర నేత’

Bjp leader took rs 5 60 crore to get mci nod for college

Kerala BJP, Kickback, Bribe, Medical Council of India, Congress, CBI probe, Parliament, Corruption, Modi government, BJP leader, 5.60 crore bribe, RS. Vinod, SR Educational Trust

A BJP probe panel has found that a Kerala party leader accepted Rs 5.60 crore from a businessman on the promise of getting the Medical Council of India’s (MCI) nod for a college

‘నీతి’ పార్టీ పోస్టుమార్టం వద్దు.. సీబీఐ విచారణే ముద్దు..

Posted: 07/20/2017 04:53 PM IST
Bjp leader took rs 5 60 crore to get mci nod for college

మెడికల్‌ కాలేజీకి భారతీయ మెడికల్‌ కౌన్సిల్‌ నుంచి అనుమతి ఇప్పించేందుకు తమ పార్టీ నేత భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నాడని వ్యవహరం వెలుగుచూడటంతో బీజేపి నేతలు నీతివంత పాలన మార్కుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలోని ఓ మెడికల్ కాలేజీ యాజమాన్యం నుంచి భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని ఎంసీఐ నుంచి అనుమతి ఇప్పిస్తానని విపక్షాలు అరోపించడమే కాదు స్వయంగా బీజేపి దర్యాప్తు బృందం కూడా ఈ విషయాన్ని నిగ్గుతేల్చింది. అంతేకాదు విచారణ సందర్బంగా ఆ రాష్ట్ర బీజేపీ కోఆపరేటివ్‌ సెల్‌ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ వినోద్ అంగీకరించినట్లు తెలిసింది.

అయితే ఈ విషయంలో సీబిఐ దర్యాప్తు చేయిస్తే నీతివంత పాలన అని చెప్పుకుంటున్న ప్రభత్వం వెనకనున్న అవినీతిపరులు గుట్టు రట్టు అవుతుందని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మెడికల్ కాలేజీకి అనుముల వ్యవహారంలో దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ, ఎన్ని కాలాశాలలకు అనుమతులు మంజూరుకు ఎన్నెన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయో  అని అనుమానాలను వ్యక్తం చేసిన విపక్ష సభ్యులు అవ్ని వివరాలు వెలుగుచూసేందుకు సిబిఐ విచారణ చేయించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఈ తరహా వ్యవహారంలో ఆ రాష్ట్ర బీజేపి చీఫ్ కుమ్మనం రాజశేఖర్ ద్విసభ్య కమిటీని వేసి విచారించి వారిపై పార్టీపరమైన చర్యలు తీసుకుని సరిపెట్టే ఉద్దేశ్యం కనబడుతుందని, అలా కాకుండా మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని, అసలు దేశవ్యాప్తంగా ఎన్ని కాలేజీలకు అనుమతులు లభించాయి, ఎన్ని దరఖాస్తు చేసుకున్నాయి.. అన్న లెక్కలు చూసి విచారణ సాగించాలని అందుకనే తాము సీబిఐ విచారణను డిిమాండ్ చేస్తున్నామని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాలేజీలకు అనుమతి ఇప్పించేందుకు ఏకంగా రూ.5.6 కోట్లను తీసుకోవడంపై విచారణ జరగాల్సిందేనన్నాయి.

అవినీతి రహిత పాలన అందిస్తున్నామని తమ సర్కారుపై తామే గొప్పులు చెప్పుకునే.. ప్రధాని నరేంద్రమోడీ.. తాను చెబుతున్న మాటలు నిజమని భావిస్తే.. మెడికల్ కాలేజీల వ్యవహారంలో మొత్తం ఎంసీఐకి వచ్చిన ధరఖాస్తులపై విచారణ జరిపించాలని ప్రత్యర్థి పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వర్కలలోని ఎస్‌ఆర్‌ ఆస్పత్రికి మెడికల్ కాలేజీ హోదా కల్పించేందుకు బీజేపి నేత లంచం తీసుకోవడంతో ఇది ఇక్క అంశంలో మాత్రమే జరిగిన వ్యవహారంగా పరిగణించవద్దని, మొత్తంగా చూడాలని అందుకనే సీబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఈ వ్యవహారంతో బీజేపీ అసలు స్వరూపం బయటపడిందంటున్న ప్రతిపక్షాలు.. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  BJP leader  5.60 crore bribe  RS. Vinod  SR Educational Trust  

Other Articles