India's new President Ram Nath Kovind భారత 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్

Ram nath kovind past magic mark to become 14th president

14th president of india, Bharatiya Janata Party, congress, Indian President, Meira Kumar, parliament, president of india, presidential election results, presidential election results 2017, presidential elections, presidential elections 2017, Ram Nath Kovind, Rashtrapati Bhavan

NDA nominee Ram Nath Kovind has crossed the winning margin to become the 14th President of India, beating opposition candidate Meira Kumar.

భారత 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్

Posted: 07/20/2017 04:03 PM IST
Ram nath kovind past magic mark to become 14th president

భారత 14వ రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. ఆయన ఈ నెల 25న రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజున ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పదవికి వీడ్కోలు పలుకుతూ రామ్ నాథ్ కోవింద్ కు పదవీ బాధ్యతలను అప్పగించనున్నారు. రామ్ నాథ్ కోవింద్ చేత భారత్ 14వ రాష్ట్రపతిగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రమాణ స్వీకరాం చేయించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో అణగారిన వర్గాల వారికి ప్రాథాన్యత కల్పించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిపింది.

ఈ నెల 17 రాష్ట్రపతి అభ్యర్థుల ఎన్నికలు జరుగగా, ఇవాళ కౌంటింగ్ చేపట్టారు. కాగా ఈ ఎన్నికలో రామ్ నాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆయన తన ప్రత్యర్థి, విపక్షాల అభ్యర్థి మీరాకుమార్ పై అదిపత్యాన్ని కనబర్చూతూ వచ్చారు. చివరకు మీరాకుమార్ పై భారీ అధిక్యంతో విజయం సాధించిన ఆయన రాష్ట్రపతికి అవసరమయ్యే అధిక్యాన్ని సంపాదించుకుని ముందుకు సాగంతో లోక్ సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్ర రామ్ నాథ్ కోవిందద్ ను విజేతగా ప్రకటించి.. ఆయన దేశానికి కాబోయే 14వ రాష్ట్రపతిగా ప్రకటించారు.

కడపటి వార్తలు అందే సరకి మొత్తం పది లక్షల 69 వేల 358 ఓట్లను లెక్కించగా, అందులో 65.65 శాతం ఓట్లను కోవింద్ ఖాతాలోకి చేరాయి. యూపీయే అభ్యర్థి మీరాకుమార్ కు 34.35 శాతం మాత్రమే వచ్చాయి. కోవింద్ కు 7,02,644 ఓట్లు, మీర్ కుమార్ కు 3,67,314 ఓట్లు వచ్చాయి. కాగా గుజరాత్; గోవా, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రామ్ నాథ్ కోవింద్ కు మద్దతుగా క్రాస్ ఓటింగ్ కూడా జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్రపతి ఎన్నికలలో రామ్ నాథ్ కోవింద్ కు ఆరు, మీరా కుమార్ కు 55.6 చెల్లని ఓట్లు కూడా పడ్డాయి. ఇక రామ్ నాథ్ కోవింగ్ విజయం ఖాయం కావడంతో అయనకు అప్పుడే అభినందనలు వెల్లివిరుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రామ్ నాథ్ కోవింద్ కు అభినందనలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles