Rare flying snake spotted in capital హైదరాబాద్ గోషామహల్లో ప్లయింగ్ స్నేక్..

Rare flying snake spotted in goshamahal of hyderabad

flying snake in Goshamahal, flying snake spotted in Hyderabad, flying snake spotted in Telangana, Ornate Flying Snake, mildly venomous snake, Andhra Pradesh, Telangana, west bengal, uttar pradesh, northeast india, South East Asia, Goshamahal, Friends of Snakes Society

A rare flying snake was found and rescued in the busy commercial locality of Goshamahal in Hyderabad.

హైదరాబాద్ గోషామహల్లో ప్లయింగ్ స్నేక్..

Posted: 07/20/2017 05:30 PM IST
Rare flying snake spotted in goshamahal of hyderabad

హైదరాబాద్ వాసులు కనివినీ ఎరుగని అరుదైన పాము గోషామహల్ లో పట్టుబడింది. ఇదేం పాము అంటారా.. ఇది గాల్లో ఎగిరే పాము. అత్యంత విషకరమైన పాము ఇది. ఇది అన్ని పాములు మాదరిగానే  బుస్ కొడుతోంది.. అంతే వేగంగా గాల్లో ఎగురుతోంది. పట్టుకోవాలని చూస్తే చుక్కలు చూపిస్తుంది. ఓ చెట్టు నుంచి మరో చెట్టుపైకి ఇట్టే ఎగిరేయగలదు. 20మీటర్ల దూరాన్ని అవలీలలుగా దాటేయగలదు. గాల్లో ఎగిరేందుకు వీలుగా ఇది దాని శరీరాన్ని సుమారు రెండింతలు వెడల్పు చేసుకుని ఎగరగలదు. దాని శత్రువుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఈ విధంగా శరీరాన్ని వెడల్సు చేసుకుంటుందీ ఇలాంటి పాముల గురించి. అప్పుడప్పుడు వార్తల్లో వినడమే కానీ ఇప్పడివరకు ఎప్పుడు చూసింది లేదు అంటారా.. మీరు అలా అనుకుంటున్నారనే కాబోలు ఏకంగా హైదరాబద్ లోని గోషామహల్ వద్దనున్న కలప దుకాణంలోకి వచ్చి తచ్చాడింది. వివరాల్లోకి వెళ్తే..

వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిటీలో గోషామహల్ ప్రాంతంలోని ఓ కలప దుకాణం వ్యాపారి తన దుకాణం ఎదరుగా తచ్చడుతున్న పామును గుర్తించి.. ఇది సాధరణంగా కనిపించే పాముల మాదిరిగా లేకపోవడంతో వెంటనే ఫ్రెండ్స్ అప్ స్నేక్ సోసైటీకి సమాచారం అందించాడు. అది ఎటూ కదలకుండా వుందని వారికి సమాచారం అందించాడు. దీంతో సాధారణంగా కనబడే పాములనే చూసి వుంటాడని రంగంలోకి దిగిన స్నేక్ సోసైటీ సభ్యులు.. దుకాణం రోలింగ్ షట్టర్ లో నక్కిన పాయును పట్టుకున్నారు. అది సాధారణంగా ఈ ప్రాంతంలో కనిపించే పాము కాదని చెప్పారు.

ఈ పామును ఒర్నేట్ ఫ్లయింగ్ స్నేక్ లేదా క్రైసోపెలి ఒర్నట అనే పేర్లతో పిలుస్తారు. ఇది అత్యంత విషపూరితమైనది. కాటు వేస్తే బతికే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు. ఫస్ట్ టైం తెలంగాణలో ఒర్నేట్ ఫ్లయింగ్ స్నేక్ కనిపించటం విశేషం అంటున్నారు స్నేక్ సొసైటీ వారు. అయితే గోషామహాల్ ప్రాంతంలో అధికంగా వున్న కలప దుకాణాలకు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన లారీలు కలపతో పాటుగా ఈ పామును కూడా అనుకోకుండా తీసుకువచ్చి వుంటాయని భావిస్తున్నారు. దీనిని ప్రస్తుతం సైనిక్ పురిలోని ఆఫీసు వెళ్లి పరిశీలిస్తే అసలు విషయం తెలిసిందన్నారు. ఇలాంటి పాములు పశ్చిమ కనుమలు, బీహార్, ఒడిసా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటాయని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : flying snake  timber shop  goshamahal  hyderabad  mildly venomous snake  Telangana  

Other Articles