Massive Landslide kills 14 in Arunachal Pradesh

14 feared dead in a landslide in arunachal pradesh

Arunachal Pradesh, Arunachal Pradesh Heavy Rains, Arunachal Pradesh Landslide, Massive Landslide Kills, Massive Landslide Death, Massive Landslide India, Natural Disaster India, Dead Bodies in Mud

Around 14 people are feared dead in massive landslide in at Laptap village under Toru Circle of Papum Pare district in Arunachal Pradesh.

ఊహించని ప్రమాదం.. బురదలో శవాలు

Posted: 07/12/2017 08:49 AM IST
14 feared dead in a landslide in arunachal pradesh

అరుణాచల్‌ ప్రదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. గత మూడు రోజులుగా అక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయి, సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ క్రమంలో పపుంపరే జిల్లాలోని ల్యాప్‌టాప్ గ్రామంలో హఠాత్తుగా కొండచరియలు విరిగిపడగా 14 మంది మృతి చెందారు.

మొత్తం 5 ఇళ్లులు పూర్తిగా ధ్వంసం కాగా, అందులో తలదాచుకుంటున్న సుమారు 25 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వారిలో 14 మృతదేహలు మాత్రమే ఇప్పటిదాకా వెలికి తీశారు. మిగతా వారికోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయని, బురద ఎక్కువగా పేరుకుపోవటంతో ఎవరూ బతికే అవకాశం తక్కువ అని అధికారులు చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి పేమ ఖండు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం మొత్తం జనజీవనం అస్తవ్యస్తమౌతోంది. విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అక్కడి గ్రామాల్లోని దాదాపుగా ఇళ్లన్నీ కొండలకు ఆనుకొనే ఉండటంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arunachal Pradesh  Heavy Rains  Massive Landslide  

Other Articles