Centre announces Rs seven lakh compensation డ్రైవర్ సలీమ్ కు రివార్డులు.. మృతులకు పరిహారం

Centre announces rs seven lakh compensation for kin of those killed

Amarnath Yatra terrorist atack, Anantnag, Jammu, Jammu and Kashmir, Kashmir, Lashkar-e-Taiba, Mehbooba Mufti, Narendra Modi, Sopore, Amarnath Yatra, pilgrims, terrorist atack, centre compensation, JK government, SASB

Centre announces Rs seven lakh compensation for kin of those killed along with jammu and kashmir state government and Sri Amarnath Seva Board

డ్రైవర్ సలీమ్ కు రివార్డులు.. మృతులకు పరిహారం

Posted: 07/11/2017 08:32 PM IST
Centre announces rs seven lakh compensation for kin of those killed

పవిత్రమైన అమర్ నాథ్ యాత్ర కోసం వెళ్తున్న భక్తులపై ముష్కరమూక జరిపిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర్ నాథ్‌ యాత్ర మృతుల కుటుంబాలకు జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వంతో పాటు అమర్‌నాథ్‌ యాత్రికుల బోర్డు(ఎస్‌ఏఎస్‌బీ) పరిహారాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.6లక్షలు, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షల  చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.

దాంతో పాటు ఎంతో చాకచక్యంగా బుల్లెట్లు దూసుకొస్తున్నా ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించిన బస్సు డ్రైవరు సలీమ్‌కు రూ.3లక్షలు రివార్డు ఇస్తున్నట్లు పేర్కొంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ. 7 లక్షలు రూపాయల నష్టపరిహారం, క్షతగాత్రులకు కూడా పరిహారాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఇస్తున్నట్లు ఎస్‌ఏఎస్‌బీ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.1.50లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.75,000 ఇస్తున్నట్లు తెలిపింది. బస్సు డ్రైవర్‌ సలీమ్‌కు జమ్ముకశ్మీర్‌ గవర్నరు వొహ్రా ప్రత్యేకంగా రూ.2లక్షల రివార్డును ఇస్తున్నట్లు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amarnath Yatra  pilgrims  terrorist atack  centre compensation  JK government  SASB  

Other Articles