passenger tries to open emergency door midair విమానం ల్యాండింగ్ అవుతుండగా..

Delhi ranchi flyer tries to open emergency door midair

unruly flyer, ruckus in flight, delhi ranchi flight, AirAsia flight I5-546, AirAsia, ruckus in air asia flight, Aftab Ahmed, co-passengers injured, crew members injured, CISF officials, emergency gate, terrorist act, Ranchi Airport, no fly list

A passenger flying from Delhi to Ranchi allegedly tried to open the aircraft's emergency door just before the flight was about to land.

ఎయిర్ ఏషియా విమానం ల్యాండింగ్ అవుతుండగా..

Posted: 07/11/2017 06:52 PM IST
Delhi ranchi flyer tries to open emergency door midair

ఎయిర్‌ఏసియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రాంచీ ఎయిర్‌పోర్టులో విమానం మరికాసేపట్లో ల్యాండ్‌ అవుతుందనగా ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తీయడంతో అందులో ప్రయాణిస్తున్నవారు తీవ్ర అందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో అతడ్ని అడ్డుకోబోయిన తోటి ప్రయాణికులతో పాటు విమాన సిబ్బందిని కూడా సదరు ప్రయాణికుడు గాయపర్చాడు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఢిల్లీ నుంచి జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని బ్రిసా ముందా ఎయిర్‌పోర్టులో విమానం రన్‌వేపైకి దిగేందుకు వస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అఫ్తాబ్ అహ్మద్ అనే ప్రయాణికుడు. ఎయిర్ ఏషియా విమానంలో ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరాడు. విమానం మరికొద్ది సేపట్లో ల్యాండింగ్ అవుతుందనగా, వింతగా ప్రవర్తించాడు. ఒక్కసారిగా లేచి విమానం ప్రమాదంలో వున్నప్పుడు తెరిచే ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. దీనిని గమనించిన తోటి ప్రయాణికులు అతడ్ని నిలువరించబోయారు.

హుటాహుటిన స్పందించిన విమాన సిబ్బంది కూడా అడ్డుకోబోయారు. అయితే వారిపై తిరగబడిన అప్తాబ్.. పలువుర్ని గాయపర్చినట్టు కూడా విమానసిబ్బంది తెలిపారు. ఈ అనూహ్య ఘటన పట్ల అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా విమానాన్ని కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. రాంచీలో విమానం ల్యాండింగ్ అయ్యాక.. సదరు ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా సదరు ప్రయాణికుడిపై నో ప్లై బ్యాన్ విధించేందుకు కేంద్రం విమానయానశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : unruly flyer  Aftab Ahmed  emergency gate  terrorist act  Ranchi Airport  air asia flight  

Other Articles