BJP leader Nupur Sharma booked for sharing fake image ఢిల్లీ బీజేపి మహిళా నేతపై నాన్ బెయిలెబుల్ కేసు

Bjp leader nupur sharma booked for sharing fake image

Fake Image, Kolkata, Basirhat, Baduria, West Bengal, Nupur Sharma, Communal violence, Gujarat riots photo, fake image on social media, BJP Delhi, Delhi Police, non-bailable case

The Kolkata Police filed a non-bailable case against the Bharatiya Janata Party’s spokesperson in the Capital for trying to pass off a photo from the 2002 Gujarat riots as one depicting the ongoing unrest in West Bengal.

ఢిల్లీ బీజేపి మహిళా నేతపై నాన్ బెయిలెబుల్ కేసు

Posted: 07/11/2017 03:43 PM IST
Bjp leader nupur sharma booked for sharing fake image

సోషల్ మీడియాలో తప్పుడు ఫొటోలు పోస్ట్‌ చేసి నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఢిల్లీ బీజేపీ నేత నుపూర్‌ శర్మపై ఎట్టకేలకు కొల్ కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ బీజేపి అధికార ప్రతినిధిగా వున్న నుపూర్ శర్మ.. శాంతి సామరస్యం కాసింత గాడి తప్పినే నేపథ్యంలో మతకల్లోహాలను ప్రేరేపించే విధంగా, మతఘర్షణలకు ప్రోత్సహించేవిధంగా మరింతగా రాష్ట్రంలో హింస రాజుకునేందుకు కుట్రపన్నుతూ తప్పుడు ఫోటోలను నెల్ పెట్టి ప్రచారం చేసినందుకు గాను నుపూర్ శర్మపై పోలీసులు నాన్ బెయిలెబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పశ్చిమ బెంగాల్ లో ఒకవైపు మతహింస, మరోవైపు నక్సల్ సమస్య, ఇంకోవైపు గూర్ఖాల్యాండ్ ఉద్యమంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్న నేపథ్యంలో సంయమనం పాటించాలని ప్రజలకు పిలుపునివ్వాల్సిన నేతలు చవకబారు పనులకు తెరలేపుతున్నారని అమెపై గర్యాహట్ పోలిస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు పోస్టు చేసి ప్రజల మధ్య ఉద్రేకాల్ని మరింత రెచ్చగోడుతూ  హిందువులపై దాడులు జరుగుతున్నాయని, బెంగాల్ లోని హిందువులకు మద్దతివ్వాలని కొన్ని ఫోటోలు పోస్టు చేశారు.

ఈ ఫోటోలు బెంగాల్ పోలీసులను చేరేవరకు షేర్ చేయండని ఆమె పోస్టు కింద పేర్కోన్నారు. దీంతో నెటిజన్లను, ఇతర మద్దతుదారులు ఆ ఫోటోలను విచ్చలవిడిగా షేర్ చేశారు. దీంతో విద్వేషాలు మరింత రేగాయి. అయితే ఆ ఫోటోలు 2002లో మోదీ సీఎంగా ఉండగా గుజరాత్ లో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలకు సంబంధించిన ఫోటోలని నెటిజన్లు నిర్ధారించారు. దీంతో వివాదాలకు దారితీసేలాంటి ఫొటోలను పోస్ట్‌ చేస్తూ...విద్వేషాలు రాజేసే నుపూర్‌ శర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక సరిగ్గా ఇలాంటి కల్పిత ఫోటోలనే పోస్టు చేసిన హర్యానాకు చెందిన ఓ మహిళానేత అబాసుపాలైన క్రమంలోనే నుపూర్ శర్మ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. హర్యానాకు చెందిన విజేత మాలిక్ కూడా ఒక బోజ్ పూరీ చిత్రంలోని అత్యాచార యత్నం సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. పశ్చిమ బెంగాల్ లో హిందూ మహిళల మానప్రాణాలకు రక్షణ కరువైందని పోస్టు పెట్టిన వెంటనే నెట్ జనుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కోన్నారు. అవవగాహన లేకుండా కల్పిత పోస్టులను పెడుతున్నారా..? లేక కావాలనే ప్రభత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇలాంటి పోస్టులు పెడుతున్నారా..?; అన్నది వారికే తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fake Image  Kolkata  Basirhat  Baduria  West Bengal  Nupur Sharma  Communal violence  

Other Articles