Family Planning, Hair Cut Allowances No More

Government staff allowances modified

Committee on Allowances (CoA), Central government employees, India Employees Allowances, Revise Allowances, Cabinet Secretary Allowances, Employees Allowances, 7th Pay Commission Allowances

Central government employees will no longer get a family planning allowance and the cabinet secretary his monthly entertainment allocation. Also gone are the diet, hair cutting and 'soap toilet' allowances given to select categories of employees.

కేంద్ర ఉద్యోగులకు అలవెన్స్ షాక్

Posted: 07/11/2017 10:09 AM IST
Government staff allowances modified

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. ఇకపై కుటుంబ నియంత్రణ ప్రోత్సాహకాలను పొందకుండా ఆదేశాలు జారీ చేసింది. జూన్ 28న జరిగిన సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్‌ లావాస నేతృత్వంలోని సీఏఓ కమిటీ అందించిన సిఫార్సుల మేరకు వాటిని మోదీ సర్కారు ఆమోదించింది. దీంతో పాటు నెలవారీ ఇచ్చే పలు రకాల అలవెన్స్ లను రద్దు చేయడం లేదా సమీక్షించడం చేయాలని ఈ కమిటీ కేంద్రానికి వెల్లడించింది.

కేంద్ర మంత్రుల సమావేశంలో వివిధ రకాల ప్రోత్సాహకాలపై సమీక్షించాలని నిర్ణయించగా, జూలై 6న ఈ నిర్ణయం వెలువడింది. ఇక కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదాలోని వారికి నెలనెలా ఇచ్చే రూ. 10 వేల ఆతిథ్య నిధిని రద్దు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.  హెయిర్ కట్ అలవెన్స్ కూడా తొలగిస్తున్నట్లు, అంత్యక్రియలు, సైకిల్ అలవెన్స్ లను మాత్రం కొనసాగించనున్నట్టు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. జూలై 1 నుంచి ఈ కొత్త అలవెన్స్ విధానం అమలుకానున్నట్లు ప్రకటించాడు.

7వ వేజ్ బోర్డు కమిషన్ కు కమిటీ ఆఫ్ అలవెన్స్ (సీఏఓ) 196 అలవెన్స్ లకు సంబంధించి పరిశీలన చేయాల్సిందిగా ఓ నివేదికను సమర్పించింది. ఏప్రిల్ 27న 34 సవరణలతో తిరిగి సీఓఏకు వేజ్ కమిషన్ నివేదిక ఇవ్వగా, ద్రవ్యసంబంధమైన వాటి విషయంలోనూ ఎలాంటి మార్పులు లేకపోవటంతో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి మరోసారి అవసరమైన మార్పులు చేయాలని కోరింది. తాజా ఆదేశాలతో టాప్ బ్యూరోక్రట్ లతోపాటు ఉద్యోగులకు అలవెన్స్ లపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే ఏడాదికి ఒకసారి జీతాల రివైజ్ లాంటి ఊరటనిచ్చే అంశాన్ని కూడా ఇందులో చేర్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Central Employees  Allowances  

Other Articles