Bhutan will not ditch with India At any cost

India and china square off bhutan in silence

Bhutan, Bhutan India Relation, Bhutan Doklam Issue, Doklam Issue, China Bhutan, Bhutan Supports India, India China War 2017, Bhutan Not ditch India, India Better Than China Bhutan

Bhutan will not ditch India even India-China standoff. Bhutan has as much at risk from the Chinese incursion in Doklam plateau as India. Giving up Doklam will give access to Chinese troops into other parts, even the capital

భారత్ ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు

Posted: 07/11/2017 09:30 AM IST
India and china square off bhutan in silence

ఓవైపు వాళ్ల కోసమే మనం, చైనా సరిహద్దులో వాదులాడుకుంటుంటే భూటాన్ మాత్రం ఇప్పటిదాకా మౌనంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సరిహద్దులో రోడ్డు నిర్మాణంతో మొదలైన గొడవ, భూటాన్ భారత్ ను సాయం కోరటం, మనం రంగంలోకి దిగి వాళ్లకు మద్ధతుగా నిలివటం తదితర పరిణామాలు చకచకా జరిగిపోయాయి. సమస్య పరిష్కారం కావాలంటే భారత్‌తో సంబంధాలు తెంచుకోవాలంటూ చైనా ఇచ్చిన ఆఫర్‌ను భూటాన్‌ తిరస్కరించింది. చైనాతో రాజీకి సిద్ధపడి, భారత్‌తో సంబంధాలను తెంచుకోవడానికి ఇష్టపడడం లేదు.

భారత్‌ విషయంలో ఎందుకు భూటాన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తుందన్న అంశాన్ని విశ్లేషిస్తే, మనతో ఆ దేశానికి ఉన్న సంబంధాలు అలాంటివి మరి అని చెబుతున్నారు. డోక్లాంలో చైనా నుంచి ప్రమాదం ఉండడంతో భారత్‌ను భూటాన్ విడిచిపెట్టే ప్రసక్తే లేదని భూటాన్ నిపుణుడు ఒకరు చెబుతున్నారు. డోక్లాం సహా వివాదాస్పద ప్రాంతాన్ని చైనా తనదిగా చెప్పుకుంటే హా, పారో, థింఫు లోయలు చైనా ఫిరంగుల లక్ష్యంలోకి వచ్చేస్తాయని ఆయన పేర్కొన్నారు.

అంతేకాదు రాజధాని థింఫుకు దారితీసే రాజధానిని చైనా ధ్వంసం చేసే ప్రమాదం ఉందని ఆయన వివరించారు. ఫలితంగా భారత్‌ నుంచి ఆహార సరఫరాకు ఉన్న ఒకే ఒక మార్గం మూతపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు భూటాన్‌లోని 495 చదరపు కిలోమీటర్లు, పశ్చిమ సెక్టార్‌లోని 286 చదరపు కిలోమీటర్లు తమవేనని చైనా వాదిస్తోంది. అయితే డోక్లాంను కనుక తమకు ఇచ్చేస్తే తూర్పు భూటాన్‌ను వదులుకోవడానికి తాము సిద్ధమని చైనా ఆఫర్ ఇచ్చింది. అదే జరిగితే చైనాకు భారత్‌పై ఆధిపత్యం చలాయించే అవకాశం లభిస్తుంది.

కానీ, చైనా ప్రతిపాదనను భూటాన్ అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. ఒకవేళ డోక్లాంను కనుక చైనాకు అప్పగిస్తే ఆ దేశ దళాలు తమ దేశంలోని మరో ప్రాంతంలోకి చొరబడతాయని భూటాన్ భావిస్తోంది. ఇది మరింత ప్రమాదకరం కావడంతో భారత్‌ వైపే లిటిల్ డ్రాగన్ కంట్రీ మొగ్గుచూపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Doklam Issue  India  China  Bhutan  

Other Articles