Amarnath Yatra attack Cowards Kill Pilgrims

Amarnath yatra terror attack kills 7 and injures 12

Amarnath Yatra, Amarnath Yatra Terror Attack, Amarnath Yatra Killed, LeT Hizbul Amarnath Yatra, Amarnath Yatra pilgrims, Terror Attack India, kashmir Attack, Ananthnag Terror Attack, Amarnath yatra Ananthnag Attack

Amarnath Yatra attack: 7 pilgrims killed, 3 cops hurt in Anantnag; Officials suspect LeT, Hizbul hand. Undeterred by attack, over 3000 pilgrims embark on yatra.

యాత్రికులపై కాల్పులు, ఆరుగురి మృతి

Posted: 07/11/2017 07:59 AM IST
Amarnath yatra terror attack kills 7 and injures 12

కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. అమర్ నాథ్ యాత్రికులపై దాడి చేసి ఆరుగురిని పొట్టనబెట్టుకున్నారు. దక్షిణ కశ్మీర్ లోని అనంత్ నాగ్ బాటెంగూ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

రాత్రి 8.30 గంటల ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ జరుపుతుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అదే సమయంలో అటుగా అమర్ నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సుపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో అక్కడికక్కడే ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు విడవగా, మరో పన్నెండు మంది గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దాడి అనంతరం ముష్కరులు అక్కడి నుంచి పారిపోగా, వారి కోసం వేట కొనసాగుతోంది. సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిని మూసివేశారు. దాడి నేపథ్యంలో అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు సంబంధిత అధికారులు తొలుత ప్రకటించారు. దాడిలో ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హిజ్బుల్‌పై అనుమానం ఈ దాడి హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ చేసినట్లుగా ఐబీ అనుమానిస్తోంది. ఇంకోపక్క ఉగ్ర దాడికి నిరసనగా మంగళవారం జమ్ము బంద్ కు పిలుపునిచ్చారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరోకరి మృతితో సంఖ్య 7కు చేరింది. 2000 సంవత్సరం తర్వాత అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. కాగా, క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ తెలిపారు. జమ్ము నుంచి అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతుందని డివిజనల్ కమిషనర్ మన్‌దీప్ భండారి తెలిపారు. యాత్రకు ఎటువంటి అంతరాయం లేదని, రేపటి నుంచి యథావిధిగా ప్రారంభం అవుతుందని ఆయన వివరించారు.

లొంగేది లేదు... మోదీ

అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించాడు. పిరికిపంద దాడులకు, విద్వేష పూరిత వ్యూహాలకు లొంగేదిలేదని ట్విట్టర్ లో ఆయన పేర్కొన్నాడు. దాడి నేపథ్యంలో కశ్మీర్ గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో ఆయన ఫోన్ లో మాట్లాడాడు. ఉగ్రవాదుల దాడి తీవ్రమైన నేరమని, ఉగ్రవాదాన్ని అణిచివేయాలన్న సంకల్పం మరింత బలపడాలని రక్షణ శాఖ మంత్రి జైట్లీ పిలుపునిచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amarnath Yatra  Terror Attack  

Other Articles